ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణిస్తున్న కరోనా వైరస్ తో చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా థియేటర్స్ అన్ని మూసేశారు. అంతేకాదు ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఇక తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్‌తో పాటు జిమ్స్, స్కూల్స్, కాలేజీలను ఈ నెల 31 వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే ఇది ఇంకాస్త ముందుకు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

 

ఇక ఇప్పటికే ఉగాదికి విడుదల కావాల్సిన నాని ‘V’ సినిమా విడుదల వాయిదా పడింది. మరోవైపు బాలీవుడ్‌లో చాలా సినిమాలు విడుదల తేదిని మార్చుకున్నాయి. ఇదే పరిస్థితి కోలీవుడ్ లోను కొనసాగుతుంది. దాంతో కొన్ని సినిమాలను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తున్నారు.  తాజాగా రానా హీరోగా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల వాయిదా పడింది. అలాగే సూర్యవంశీ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు అందుకు 120 కోట్ల డీల్ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్ లో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసారు. అయితే త్వరలోనే మళ్ళీ తిరిగి షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయన్న వార్త వినిపిస్తుంది. జూన్ రెండవవారం నుండి షూటింగ్స్ మొదలవబోతున్నాయని తెలుస్తుండగా ముందుగా ఒక స్టార్ హీరో సినిమానే సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అంటున్నారు. ఇక అరణ్య సినిమా దాదాపు రెండేళ్ళ నుండి రానా ని వదలడం లేదు. ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఎప్పటికపూడు సాగుతూనే ఉంది. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా అడవి మనిషిగా నటిస్తున్నాడు.  ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ని క్రియోట్ చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: