టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ హవా గురించి తెలిసిన విషయమే. ఆ స్టైలే బన్నీకి సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ దక్కేలా చేసింది. మళయాళంలో బన్నీకి ఫ్యాన్స్ అసోసియేషన్లే ఉన్నాయి. మెగా హీరోగా ఎంటర్ అయినా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బన్నీ కెరీర్లో అత్యంత స్టైలిష్ గా కనిపించిన సినిమాగా ‘ఇద్దరమ్మాయిలతో’కు ప్రత్యేక ప్లేస్ ఉంటుంది. ఫుల్ రొమాంటిక్ ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటితో 7ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

స్టార్ డైరక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 మే31న వేసవి సెలవుల సందర్భంగా విడుదలైంది. హీరో క్యారెక్టరైజేషన్ ను పూర్తి మాస్ యాంగిల్ లో తెరకెక్కించడంలో పూరి దిట్ట. ఈ సినిమాలో కూడా బన్నీ మేకోవర్ పైగానీ. స్టైల్ లో గానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. బన్నీ డ్రెస్సింగ్ లో, పాటల్లో, ఫైట్లలో.. పూర్తి వైవిధ్యం చూపించాడు. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్. థాయిలాండ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ కెచ్చా ఈ సినిమాలో ఫైట్స్ డిజైన్ చేశాడు. హీరోయిన్లుగా అమలాపాల్, కేథరిన్ తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం, ఆలీ కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ అయింది.

IHG' movie Working Stills ft. allu arjun, amala Paul ...

సినిమాకు మరో ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. క్లాసిక్, వెస్ట్రన్ సంగీతంపైనే సినిమా థీమ్ ఉంటుంది. పూరి తన మార్క్ మేకింగ్ తో సినిమాను తెరకెక్కించాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేశ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. యూరప్ లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమాను భారీగా చాలా రిచ్ గా తీశాడు. మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా బన్నీ కెరీర్లో స్పెషల్ గా నిలిచింది.

IHG' movie Working Stills ft. allu arjun, amala Paul ...

మరింత సమాచారం తెలుసుకోండి: