తెలుగు సినిమా చరిత్రలో ఘట్టమనేని కృష్ణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోగా ఆయన 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఈ రికార్డు శాస్వతంగా కృష్ణ పేరు మీదే ఉండిపోతుంది. కృష్ణ నుంచి నటశేఖర కృష్ణగా.. సూపర్ స్టార్ కృష్ణగా ఆయన పయనం ఓ అద్భుతం. దూరదృష్టితో ఆయన చేసిన ఆలోచనలు ఎన్నో కొత్త టెక్నాలజీలు తెలుగు సినిమాల్లో రావడానికి కారణమైంది. తనయులు రమేశ్, మహేశ్, మంజులను సినిమాల్లో ప్రోత్సహించారు. ముఖ్యంగా మహేశ్ లో ఓ స్టార్ హీరో ఉన్నాడని మహేశ్ ఐదేళ్ల వయసులోనే తెలిసిందట.

IHG

పిల్లలతో కలిసి కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, అన్న తమ్ముడు, కలియుగ కర్ణుడు, ఆయుధం.. వంటి సినిమాలు చేశారు. వీరిలో మహేశ్ లో చిన్నప్పుడే మంచి స్పార్క్ ఉండేది. కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు సినిమాల్లో మహేశ్ చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో మహేశ్ పై కృష్ణ అభిమానులు అప్పట్లోనే ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టే మహేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. నిజానికి మహేశ్ ని ఎస్వీ కృష్ణారెడ్డి తన ‘యమలీల’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేయించాలని ప్రయత్నించారు. కానీ.. కృష్ణ అందుకు ఒప్పుకోలేదు. చదువు పూర్తయ్యాన సినిమాల్లో నటిస్తాడని వారించారు.

IHG

కుమార్తె మంజుల మాత్రం ఆమె పెద్దయ్యాకే సినిమాల్లో నటించింది. ‘షో’ సినిమా ద్వారా నటిగా, నిర్మాతగా కూడా పరిచయమయ్యారు. అటుపై నాని, పోకిరి, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావే.. సినిమాలను ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలోనూ భర్తతో కలిసి నటించారు. ఇలా.. కృష్ణ తన పిల్లలను సినిమాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారు. రమేశ్ సినిమాలు ఆపేసినా కృష్ణకు నట వారసులుగా మహేశ్, మంజుల ఆయన పేరు నిలబెట్టారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: