ఎప్పుడూ తమిళ హీరోలే మన దగ్గరకు వస్తారా.. మన స్టార్లు కోలీవుడ్ కు వెళ్లరా.. మన కథలు తమిళనాట సత్తాచాటలేవా.. అని సినీ జనాలను చాలా మంది అడుగుతుంటారు. అయితే మన టాప్ హీరోలు ఎక్కువగా తెలుగు మార్కెట్ నే ఫోకస్ చేశారు. అయితే యంగ్ స్టర్స్ మాత్రం కోలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై బయల్దేరుతున్నారు. 

 

చాక్లెట్ బాయ్ లుక్ తో బీసీ సెంటర్స్ ను మాయ చేసిన ఇస్మార్ట్ శంకర్, ఇప్పుడీ మార్కెట్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు. తమిళనాడులోనూ స్టార్డమ్ సంపాదించుకునే ఆలోచనలో ఉన్నాడు రామ్.చెన్నైలో పెరిగిన రామ్ త్వరలోనే ఓ తమిళ సినిమాలో నటిస్తాడని చెప్పాడు. ఇక ప్రస్తుతం రామ్ తడమ్ రీమేక్ రెడ్ లో నటిస్తున్నాడు. 

 

ఆలోచనల్లోనే కాదు, మార్కెట్ విషయంలోనూ విజయ్ దేవరకొండ చాలా ఫాస్ట్ గా ఉంటున్నాడు. కెరీర్ బిగినింగ్ లోనే నోటా అనే సినిమాతో కోలీవుడ్ కు వెళ్లాడు. తర్వాత నాలగు దక్షిణాది భాషల్లో డియర్ కామ్రేడ్ చేశాడు. అయితే విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్న సినిమాలు అతని అంచనాలను అందుకోలేకపోయాయి. కానీ విజయ్ కు తమిళనాట రౌడీ హీరో అనే గుర్తింపు మాత్రం దక్కింది. 

 

నోటా, డియర్ కామ్రేడ్ సరైన ఫలితం అందుకోలేకపోయినా విజయ్ దేవరకొండ నిరాశ చెందలేదు. ఈ సారి సౌత్ తో పాటు నార్త్ లోనూ టాలెంట్ చూపించాలని ఫైటర్ గా మారాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. కరణ్ జోహార్, పూరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇండియావైడ్ గా రిలీజ్ కాబోతోంది.

 

శర్వానంద్ స్టోరీస్ విషయంలో ఎంత యూనిక్ గా ఆలోచిస్తాడో, మార్కెట్ విషయంలోనూ అంతే పర్టిక్యులర్ గా ఉంటున్నాడు. తమిళనాడులో యూనిక్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గమ్యం రీమేక్ కాదలనా సుమ్మ ఇల్లై సినిమాతో కోలీవుడ్ కు వెళ్లిన శర్వా జర్నీతోఅక్కడ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చేస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: