లాక్ డౌన్ వల్ల గత మూడు నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ లు జూన్ 15 నుండి తిరిగి ప్రారంభం అవకాశాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ ల పునఃప్రారంభం కావడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించినా దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో ఇంకా క్లారిటీ రావడంలేదు.


దీనితో ఇండస్ట్రీ ప్రముఖులు అంతా చిరంజీవి ఇంటిలో పలుమార్లు సమావేశం అవ్వుతూ షూటింగ్ ల పునఃప్రారంభానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్న విషయమై చాల లోతుగా చర్చలు చేస్తున్నారు. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ లాంటి పెద్ద సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో ఈమూవీ నిర్మాతలు విపరీతంగా ఆందోళన పడుతున్నారు.


తెలుస్తున్న సమాచారంమేరకు తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్న విధివిధానాలకు అనుగుణంగా వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి ‘ఆచార్య’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలకంటే ‘వకీల్ సాబ్’ కు అవకాశాలు చాల అనువుగా ఉన్నాయని తెలుస్తోంది. దీనికికారణం ఈసినిమాకు సంబంధించి షూటింగ్ పెండింగ్ లో ఉన్నది కేవలం కోర్ట్ సీన్స్ మాత్రమే అని అంటున్నారు. దీనితో అతి తక్కువ మంది యూనిట్ సభ్యులతో వెంటనే సెట్ లో షూటింగ్ ప్రారంభించడానికి ‘వకీల్ సాబ్’ కు పరిస్థితులు చాల అనుకూలంగా ఉన్నాయి. దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన పెండింగ్ సీన్స్ విషయంలో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేకపోవడంతో షూటింగ్ అతి తక్కువ మందితో చాల సులువుగా చేయవచ్చు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాకు సంబంధించి ఇక కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో ఈ సినిమాను వేగంగా పూర్తిచేసి అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ లో వచ్చే విజయదశమి రోజున విడుదల చేయడం ద్వారా తిరిగి తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లకు పూర్వ కళ తీసుకు రావడానికి పవన్ కళ్యాణ్ మ్యానియా బాగా సహకరిస్తుంది అన్న అభిప్రాయం అందరికీ ఏర్పడటంతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలకు ఫస్ట్ ఛాయస్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: