నటసింహ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. బర్త్ డే స్పెషల్ గా బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారా.. లేదా.. అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య కానుక ఇవ్వనున్నారట. పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న బాలయ్య ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం  ఉందట. దీంతో నందమూరి అభిమానులు జూన్ 10 కోసం ఆతృతగా వెయిట్ చూస్తున్నారు. ఇది ప‌క్క‌న పెడితే ఈ సినిమాకు సంబంధించిన బ‌డ్జెట్ విష‌యాల్లో కొంత మేర క‌ట్టింగ్స్ జ‌రిగిన‌ట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని సినిమాల బడ్జెట్ లలో చాలా వరకు మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏ సినిమా విషయంలో కూడా అదే జరిగిందట. అంతేకాకుండా ఈ సినిమాలో కొంతమేర ఫారిన్ లొకేషన్స్ లో ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫారిన్ కాదు కదా స్టేట్ గేట్ దాటే సిచ్యుయేషన్ కూడా లేదు. దీంతో పూర్తి ఫారిన్ ఎపిసోడ్స్.. అక్క‌డ జ‌రిపే స‌న్నివేశాల్ని విశాఖ‌కు షిప్ట్ చేసి ఇక్క‌డ లోకల్ బ్రాక్ డ్రాప్ లో క‌థ రెడీ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా ఒక  తెలుగమ్మాయి అంజలిని అనుకుంటున్నారట. వీరిద్దరూ గతంలో 'డిక్టేటర్' సినిమాలో కలిసి నటించారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: