వెండితెర నవరస నటనాసార్వభౌముడు గా కొన్ని వందల సినిమాలలో నటించిన కైకాల సత్యనారాయణకు 85 సంవత్సరాల వయస్సు వచ్చినా ఇంకా చాల యాక్టివ్ గా ఉండటమే కాకుండా తాను ఇప్పటికీ నటించడానికి రెడీ అని అంటున్నాడు. వాస్తవానికి కొన్ని సినిమాలలో తనకు తాత పాత్ర పోషించమని ఆఫర్లు వస్తున్నా తనకు ఆపాత్ర నచ్చక వదులుకుంటున్న విషయాన్ని వివరించాడు. 


ఇదే సందర్భంలో ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ఇప్పటి ట్రెండింగ్ సినిమాలలో తనకు ఒక్క సినిమా కూడ నచ్చలేదనీ అందువలనే తాను ఆసినిమాల గురించి మాట్లాడలేను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ పిరియడ్ లో తాను పాత సినిమాలు అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని వివరిస్తూ ప్రస్తుతం తాను రోజుకు రెండు సినిమాలు చూస్తున్నాను అని చెప్పాడు. 


ప్రతి వ్యక్తి జీవితంలో ఏదిజరగాలో అది జరిగి తీరుతుంది అని తాను నమ్ముతాను అనీ దీనిని తప్పించుకోవడానికి ఎవరు ఎన్ని గుళ్ళకు వెళ్ళినా జ్యోతిష్కులను సంప్రదించినా వారు మన కర్మ ఫలితాన్ని తప్పించలేరు అన్నఅభిప్రాయం వ్యక్త పరుస్తున్నాడు. 85 సంవత్సరాలు వచ్చినా తన ఆరోగ్య రహస్యం మితాహారం అని అంటూ గతంలో సీనియర్ నటులు గుమ్మడి గిరిబాబు సారధి లాంటి మిత్రులు తనకు అనేకమంది ఉండేవారని ప్రస్తుత తరం నటీనటు లతో తనకు పరిచయం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 


తనకు 85 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ ప్రతిరోజు మితంగా ఆల్కాహాల్ తీసుకుంటానని అయితే ఇది అంతా డాక్టర్ సూచనల ప్రకారమే చేస్తున్నాని చెపుతూ తాను కూడ కరోనా భయంతో ఇంట్లోనే ఉన్నప్పటికీ రోజుకు అనేకసార్లు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ రోగనిరోధక శక్తి పెంచే పౌష్టిక ఆహారం తీసుకుంటూ తనను కలవడానికి ఎవరు రావద్దని తన బంధువులకు సన్నిహితులకు తానే స్వయంగా చెప్పాను అని అంటున్నాడు. ఉదయం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వింటూ ఆతరువాత యోగాసనాలు వేస్తూ వరస పెట్టి సినిమాలు చూస్తూ రాత్రికి కొద్దిగా ఆల్కాహాల్ తీసుకుని తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని అంటున్నాడు ఈ నటనాసార్వభౌముడు..

మరింత సమాచారం తెలుసుకోండి: