బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తన 77వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం ఎలా కొనసాగిందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 1961 వ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ తన మరదలు అయిన ఇందిరను పెళ్లి చేసుకున్నాడు. అయితే 1967వ సంవత్సరంలో విడుదలైన సాక్షి సినిమాలో కృష్ణ సరసన విజయనిర్మల నటించింది. అయితే ఈ సినిమా సెట్స్ లలో పరిచయం పెంచుకున్న కృష్ణ విజయనిర్మల లు ఆ తర్వాత కూడా బాగా మాట్లాడుకునే వారు. కాలక్రమేణా వారిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. రెండు సంవత్సరాల పాటు విజయనిర్మల తో డేటింగ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ 1969 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి తిరుపతిలో కేవలం నలుగురు సమక్షంలో జరిగింది. 


కృష్ణ విజయ నిర్మల ను రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ తన మొదటి భార్యను ఏనాడూ కష్టపెట్టలేదు. తన ఇద్దరు భార్యలతో చాలా ప్రేమగా మెలిగేవారు. అందుకే వారి కుటుంబం లో ఇప్పటివరకు ఎలాంటి చిన్న గొడవ కూడా చోటు చేసుకోలేదు. సూపర్ స్టార్ కృష్ణ తన ఇద్దరు భార్యలతో కలిసి ఐదుగురు పిల్లల సంతానం కలిగింది. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అయితే వీరి కుటుంబంలో కలహాలు రాకపోవడానికి ఇందిరా దేవి, విజయనిర్మల హోండా తనమేనని చెప్పుకోవచ్చు. నిజంగా ఇలాంటి భార్యలు సూపర్ స్టార్ కృష్ణ కు లభించడం అదృష్టమని సినీ ప్రముఖులు సన్నిహితులు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు చెప్పారు. 


తన సొంత బిడ్డలు కాకపోయినా విజయ నిర్మల ఇందిరాదేవి చిన్న కొడుకు మహేష్ బాబును, పెద్ద కొడుకు రమేష్ బాబులను ఎంతో గారాబంగా చూసుకునేది. ప్రస్తుతం కృష్ణ పిల్లలంతా ఉన్నతమైన స్థానాల్లో రాణిస్తున్నారు. కొంతమంది సినీ రంగంలో రాణిస్తున్నారు. మరి కొంతమంది రాజకీయ రంగాలలో వ్యాపార రంగాలలో దూసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: