కొన్ని కొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో  హీరోగా పరిచయం అవడం సులభంగా జరిగిపోతుంది కానీ ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకుని ఎంతగానో గుర్తింపు సంపాదించడం మాత్రం తమ  సొంత టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు గా తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అయినప్పటికీ ఎక్కువశాతం గుర్తింపును సంపాదించ లేకపోతున్నారు. అందుకే ఏ హీరోకైనా బ్రేక్ ఇచ్చే సినిమా వచ్చింది అంటే ఆ హీరో ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్కు బ్రేక్ ఇచ్చిన సినిమా తన మూడవ సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణ తేనెమనసులు అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. 

 


 ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఎంత గుర్తింపు సంపాదించాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. అయితే సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ తక్కువ సమయంలోనే ఓ సినిమా సూపర్ స్టార్ కృష్ణకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమానే గూడచారి 116.తేనె మనసులు సినిమా తర్వాత మూడవ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ గూడచారి 116 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

 


 సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడచారి 116 సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోని మొదటి జేమ్స్ బాండ్ సినిమా కావడం గమనార్హం. దీంతో కెరీర్ మొదట్లోనే ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసిన  కృష్ణ ఈ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి జేమ్స్ బాండ్ చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకులు   కూడా సినిమాను మరింత ఆసక్తిగా తిలకించి  ఆదరించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక సాదాసీదా హీరోగా ఉన్న కృష్ణను ఒక్కసారిగా స్టార్ హీరో లెవెల్ కి తీసుకెళ్ళింది గూడచారి116 సినిమా. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది అని  చెప్పాలి. ఈ సినిమా తర్వాత స్టార్ హీరో రేంజ్ సంపాదించిన కృష్ణ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: