తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకు ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించబడింది. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత తేనెమనసులు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా  పరిచయమయ్యారు.ఆ తర్వాత ఎన్నో  విజయవంతమైన సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణకు మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు సూపర్ స్టార్ కృష్ణ. హైదరాబాద్ వేదికగా పద్మాలయా స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి... ఎన్నో సినిమాలను నిర్మించారు. 

 


 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికింది కేవలం సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ ద్వారానే అంతకు మునుపెన్నడూ తెలుగు చిత్ర పరిశ్రమలో లేని కొత్త సాంకేతిక పరిజ్ఞానం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. అందుకే టాలీవుడ్ లో  ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణకు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అప్పటివరకు ఏ హీరోలకు సాధ్యం కానీ... సరికొత్త ప్రయత్నాలు చేసి ... విజయం సాధించారు  సూపర్ స్టార్ కృష్ణ. కెరీర్ ప్రారంభంలోనే ఎక్కడ భయపడకుండా ముందడుగు వేశారు. తేనెమనసులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం ఆయన కృష్ణ...మూడవ  సినిమాగా గూడచారి 116 అనే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటివరకు జేమ్స్ బాండ్  సినిమాలు ఏది రాలేదు కాని తొలిసారి కృష్ణ తొలి జేమ్స్ బాండ్ సినిమా గూడచారి 116 తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఏ హీరో కూడా కౌబాయ్ పాత్రలో నటించలేదు... మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక తొలి టెలిస్కోప్ సినిమాగా కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా తొలి 70 ఎమ్ఎమ్  సినిమా సింహాసనం కూడా సూపర్  స్టార్ కృష్ణ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైంది.  ఇలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: