ఒక సాదాసీదా వ్యక్తి గా తన కెరియర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా  ఎదిగారు కృష్ణ. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు అని చెప్పాలి . చిత్ర పరిశ్రమలో ఎప్పటికి సూపర్ స్టార్ కృష్ణ కు  ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇక ప్రతి విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచేవారు. అప్పట్లో దర్శక నిర్మాతలందరూ కృష్ణ తో సినిమాలు తీయడానికి క్యూ కట్టేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కృష్ణ కూడా సినిమాలు తీయడం విషయంలో ఎంతో డెడికేషన్ చూపించేవారు. కొంచెం కూడా రెస్ట్ లేకుండా సినిమాలు తీసేవారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో చాలామంది సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ ఉంటారు. 

 


 అంతకుమించి చేయడం అంటే చాలా కష్టమైన పని అని చెబుతూ ఉంటారు . కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం సంవత్సరానికి   ఏకంగా పది సినిమాలు చూసేవారట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ప్పటికీ నిజమే.  అంతలా నటనలో డెడికేషన్ చూపించేవారట సూపర్ స్టార్ కృష్ణ. సంవత్సరానికి దాదాపుగా పది సినిమాలను విడుదల చేసే వారట. ఎక్కడ రెస్ట్  తీసుకోకుండా సినిమాలను పూర్తి చేయడంలో ఎంతగానో డెడికేషన్ చూపించేవారట సూపర్ స్టార్ కృష్ణ. అందుకే దర్శక నిర్మాతలు కూడా సూపర్ స్టార్ కృష్ణ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారట. ఏ సినిమాకి కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ సమయాన్ని వృధా చేయలేదు అని చెబుతూ ఉంటారు టాలీవుడ్ లో. 

 


 ఒకే సమయంలో ఏకంగా మూడు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొనే వారట సూపర్ స్టార్ కృష్ణ. చాలా మటుకు రాత్రి పగలు కష్టపడే వారట. ఇలా ఒకప్పుడు కృష్ణ చూపించిన డెడికేషన్ మాత్రం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తారేమో గానీ అంతకుమించి చేయడం మాత్రం చాలా కష్టమే. అంతే కాకుండా ఒకే సమయంలో రెండు మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్లో పాల్గొనడం అంటే అది మరింత కష్టతరమైన పని. ఏదేమైనా ఒకప్పుడు హీరోలు మాత్రం ఇప్పటికీ ఎంతో మందికి తమ డెడికేషన్ తో ఇన్స్పిరేషన్గా నిలుస్తునే  ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: