ఘట్టమనేని కృష్ణ తెలుగు పరిశ్రమలో ఉత్తమ నటుడు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సినిమా హీరో కావాలనే ఒక ఆశయంతో నే ముందడుగు వేసి తాను అనుకున్నట్టు గొప్ప హీరో అయ్యి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ కి సినీ రంగంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఎన్టీరామారావు నటన చూసిన తర్వాతనే అతనిలో వచ్చిందట. తాను ఎనిమిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు టి రామారావు హీరోగా నటించిన పాతాళభైరవి సినిమా ను చూసి ఫిదా అయిపోయాడు అట. పింగళి నాగేంద్ర రావు, కేవీరెడ్డి రాసిన నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అనే డైలాగులను పదేపదే చెప్పి సినిమాలపై బాగా ఆసక్తి పెంచుకున్నాడట. ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ పై వీరాభిమానం పెంచుకున్నారట. 


తన చదువును పూర్తి చేసిన తర్వాత కృష్ణ తనకి సినిమాల్లో నటించాలని ఉందని తన తల్లిదండ్రులకు చెప్పగా... వాళ్ళు వెంటనే అతనికి డబ్బులు ఇచ్చి మద్రాస్ కి పంపించారు. పంపించే ముందు రెండు రికమండేషన్ లెటర్లను v prasad OLD' target='_blank' title='ఎల్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎల్ వి ప్రసాద్ బంధువులతో రాయించి కృష్ణ కి ఇచ్చారు. 1962వ సంవత్సరంలో ఆ లెటర్స్ పట్టుకొని మద్రాస్ కు వెళ్ళిన కృష్ణ తన తల్లిదండ్రులు ఇచ్చిన లెటర్ ను నిర్మాత చక్రపాణి కి చూపించారు. కాకినాడ చక్రపాణి కృష్ణకేసి పైకి కిందకి చూసి బాగున్నావ్ అబ్బాయి కానీ చాలా లేత గా ఉన్నావ్. ఇక ఇప్పుడు 20ఏళ్ళ మాత్రమే ఉన్నాయి కదా. ఎన్టీరామారావు షావుకారు సినిమాలలో నటించేప్పుడు అతనికి 28 సంవత్సరాలు ఉన్నాయి. అందుకే నువ్వు కూడా అయిదు ఆరు సంవత్సరాలు ఆగి సినిమారంగంలో అరంగేట్రం చేస్తే బాగుంటుంది అని సూచించారు. అలాగే తాను మాట్లాడుతూ అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా పరిచయం అతని వద్దకు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి ఎన్టీఆర్ కు కృష్ణ ను పరిచయం చేశారు. 


ఆ సమయంలో ఎన్టీఆర్ భట్టివిక్రమార్క చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. చక్రపాణి పిలవగానే ఎన్టీఆర్ వచ్చి కృష్ణని పలకరించాడు. ఏం బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చావు? అని బాగోగులు అడిగిన తర్వాత నువ్వు చాలా బాగున్నావ్ బ్రదర్. ఎత్తు తో పాటు అందం గా కూడా ఉంటాడు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది మీకు చక్కటి రూపం ఉందని. కాకపోతే మీకు నాటకాల్లో అనుభవం లేదు అంటున్నారు కాబట్టి సినిమాల్లో ప్రయత్నాలు చేసేముందు నాటకాలలో నటిస్తే సినిమాల్లో నటించడం బాగా సులువు అవుతుందని ఎన్టీ రామారావు కృష్ణ కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది సమయం పాటు నాటకాలలో నటించి తన నటనా చాతుర్యాన్ని చాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: