సూపర్ స్టార్ కృష్ణ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు. ఎంతమంది హీరోలు క్రేజ్ సంపాదించినప్పటికి సూపర్ స్టార్ కృష్ణకు మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తనదైన  శైలిలో సినిమాలు తీస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఇందిరను పెళ్లి చేసుకోగా... కృష్ణకు మొదటి సంతానం ఇద్దరు ఆడపిల్లలు...ఇద్దరు మగపిల్లలు..వారే   రమేష్ బాబు మహేష్ బాబు పుట్టారు. ఇక ఆ తర్వాత విజయనిర్మల ను కృష్ణ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే విజయనిర్మలకు అప్పటికే పెళ్లయి ఒక సంతానం కూడా ఉంది. ఆ సంతానమే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్. 

 


 విజయనిర్మలకు పెళ్లి అయినప్పటికీ ఆ తర్వాత తన భర్తతో తీవ్రమైన మనస్పర్ధలు రావడం కారణంగా విడిపోయింది విజయనిర్మల. విజయనిర్మల ఒంటరిగా ఉంటున్న సమయంలోనే సూపర్స్టార్ కృష్ణతో వరుసగా ఎన్నో సినిమాల్లో నటించింది. వీరు  నటించిన సినిమాలు మంచి విజయం కూడా సాధించాయి. వీరిద్దరి జోడి టాలీవుడ్లో బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. అయితే ఇలా సినిమాలు తీస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 

 


 ఇక వీరిద్దరి పెళ్లి ఎంతో రహస్యంగా తిరుపతిలో కొంతమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే వీరి పెళ్లి జరిగిన తర్వాత విజయనిర్మల మొదటి సంతానమైన నరేష్ ను సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడా తక్కువ చూడలేదు. సొంత తండ్రి లాగానే చూశారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక విజయనిర్మల చిత్ర పరిశ్రమలో సంపాదించిన మొత్తాన్ని కేవలం నరేష్ కి చెందేలా చేశారు సూపర్ స్టార్  కృష్ణ. మొదటినుంచి నరేష్ కి ఎప్పుడు ప్రయారిటీ ఇస్తూ  వచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం నటుడు నరేష్ కూడా  కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇలా వీరిద్దరూ తండ్రి కొడుకులు కాకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న బంధం మాత్రం తండ్రీ కొడుకుల అనుబంధానికి ఎప్పుడు సూచిస్తూనే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: