తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఒక దశాబ్ద కాలం పాటు సూపర్ స్టార్ కృష్ణ ఒక చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి. ఎంతగానో క్రేజ్ ను సంపాదించారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా... ఆయన పర్శనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు అన్న విషయం తెలిసిందే. మొదట సూపర్ స్టార్ కృష్ణ ఇందిరను పెళ్లి చేసుకున్నారు. 

 

 

 ఆ తర్వాత విజయనిర్మల నీ  రెండో వివాహం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే విజయనిర్మల కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించింది విజయనిర్మల. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇక అప్పటికే విజయనిర్మలకు పెళ్లై ఒక సంతానం కూడా ఉంది. కానీ విజయనిర్మలకు తన భర్తకు మధ్య తీవ్రమైన మనస్పర్ధలు రావడం కారణంగా ఇద్దరు విడిపోయారు. ఇక సూపర్ స్టార్  కృష్ణతో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో విజయనిర్మల ఒంటరి గానే ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిగురించింది.

 


 ఇక వీరిద్దరూ పెళ్లి తో ఒక్కటయ్యారు. అటు సూపర్ స్టార్ కృష్ణకు ఇటు విజయనిర్మలకు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. వీరిద్దరి పెళ్లి కూడా తిరుపతిలో జరిగింది. కొద్ది మంది సన్నిహితులు మిత్రులు బంధువుల సమక్షంలో ఎంతో రహస్యంగా వీరి వివాహం జరిగింది. అయితే విజయనిర్మలకు మొదటి సంతానం అంటే మొదటి భర్తతో కలిగిన సంతానం తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్న  నరేష్. అయితే కృష్ణ నరేష్ విషయంలో ఎంతో  జాగ్రత్తలు తీసుకున్నాడు. నరేష్ కి కూడా ఎంతో ప్రియారిటి ఇస్తూ వచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం నరేష్ కి కూడా కోట్ల ఆస్తులు ఉండడం గమనార్హం. విజయనిర్మల సంపాదించిన మొత్తాన్ని కృష్ణ తీసుకోకుండా కేవలం విజయనిర్మల తనయుడు  నరేష్ కి అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: