తెలుగు సినిమాలకు కొత్త కొత్త రంగులు అద్దిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు పోటీగా నిలిచారు. జేమ్స్ బాండ్ కౌ బాయ్ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మొట్టమొదటి హీరోగా సూపర్ స్టార్ కృష్ణ సంచలనం సృష్టించాడు. ఈరోజు అనగా అన్నయ్య 31 వ తేదీన కృష్ణ 77 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 


ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నం దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31 మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివరామకృష్ణ మూర్తి జన్మించాడు. బుర్రిపాలెం గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల పాటు ప్రతిరోజూ నడుస్తూ తెనాలి మండలం లో ఉన్న స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు కృష్ణ. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లో దేవదాసు సినిమా శత దినోత్సవం కార్యక్రమానికి ఏఎన్ఆర్, సావిత్రిలు కారులో వచ్చినప్పుడు... దగ్గర్లోని వందల మంది ప్రజలు కారు వెనుక పడ్డారు. ఇది గమనించిన కృష్ణ ఏమైంది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగితే... ఆ కారులో హీరో అక్కినేని నాగేశ్వరరావు హీరోయిన్ సావిత్రి లు ఉన్నారు అని చెప్పారు. అప్పుడే ఏఎన్ఆర్ ని చాలా దూరంగా చూసి ఈ సినిమా వాళ్లకి ఇంత పాపులారిటీ ఉంటుందా? నేను కూడా హీరోనే కావాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. 


10వ తరగతి పూర్తయిన తర్వాత ఎస్.ఎస్.ఎల్.సి ని ఎందుకు కృష్ణ గుంటూరు వెళ్ళాడు. కానీ అక్కడ సీటు దొరకకపోవడంతో నరసాపురం లో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ చదవాలని ఉద్దేశంతో ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. కానీ నర్సాపురం లో ఎక్కువ రోజులు చదవలేదు. మూడు నెలల తర్వాత టీసి తీసుకుని ఏలూరులో ఉన్న సి.ఆర్.రెడ్డి కళాశాలలో జాయిన్ అయ్యాడు. ఇంటర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదివేందుకు ప్రవేశ పరీక్షలు రాశాడు కానీ వాటన్నిటిలో ఫెయిలయ్యాడు. ఇక చేసేదేమీ లేక బిఎస్సి చదువు పూర్తి చేసి అనంతరం ఇంజనీరింగ్ చేద్దామని భావించాడు. అప్పట్లోనే హీరో మురళీమోహన్ కృష్ణకు క్లాస్మేట్ కావడంతో అతనికి పరిచయమయ్యాడు. ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నప్పటికీ సీట్ దొరక్కపోవడంతో తాను బిఎస్సి చదువుతో తన విద్యార్థి జీవితానికి స్వస్తి పలికాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: