టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోలు కృష్ణ ఎన్టీఆర్. వీళ్ళ సినిమాలు అన్నా వీళ్ళ నటన అన్నా సరే ప్రేక్షకులకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉండేది. వారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. ఇక వారి మధ్య కొన్ని రోజులు ఆధిపత్య పోరు కూడా నడిచింది అని చెప్తూ ఉంటారు. వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు చూసిన సినీ రాజకీయ పెద్దలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. వాస్తవానికి కృష్ణ వివాదాలకు దూరంగా ఉంటారు అనే పేరు ఉంది. కాని ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉంది అని అంటారు. 

 

చాలా మంది ఎన్టీఆర్ ఆధిపత్యం కృష్ణ కు నచ్చేది కాదని అందుకే వారి మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. కాని కాదని కృష్ణ ఎన్టీఆర్ కి చాలా పెద్ద అభిమాని అని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని కృష్ణ కూడా స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. కాని వారి మధ్య ఆధిపత్య పోరుతోనే వివాదాలు వచ్చాయి అని అంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసే సినిమాలకు కృష్ణ నుంచి ఇబ్బందులు రావడం కృష్ణ చేసే సినిమాలకు ఎన్టీఆర్ నుంచి ఇబ్బందులు రావడం వంటివి జరిగాయి. కాని ఆ తర్వాత కొందరు పెద్దల రాజీ తో ఇద్దరూ కూడా సెట్ అయ్యారు అని అంటారు. 

 

ఇక ఎన్టీఆర్ తనను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసిన కృష్ణ ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం తో కూడా పావులు కదిపారు అని అంటారు. కాని అదేమి లేదని  మీడియా అనవసరంగా ఇద్దరి మధ్య లేని ఒక యుద్ధం సృష్టిచింది అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. ఇక వీరి వివాదం తర్వాత కూడా కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: