టాలీవుడ్ లో కిందటి తరంలో ప్రయోగాలు అనగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు కృష్ణ. ఆయన సినిమాలు ఆయన నటన ఆయన రేంజ్ కూడా ఎవరూ అందుకోలేదు. ఎన్నో ప్రయోగాలు చేయడమే కాకుండా ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇక కృష్ణ సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. ఇక అది పక్కన పెడితే... ఆయన సినిమాల్లో కొన్ని ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా సింహాసనం. 

 

సినిమా తెలుగులో మొదటి 70 ఎం ఎం సినిమా కావడం గమనార్హం. ఆ సినిమా మంచి విజయం సాధించడం తో కృష్ణ రేంజ్ అక్కడి నుంచి కూడా ఒక రేంజ్ లో పెరిగింది ఆ సినిమా తర్వాత ఆయన నిర్మాతలకు కూడా ఆదర్శంగా నిలిచారు. చాలా మంది నిర్మాతలు ప్రయోగాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. కాని కృష్ణ మాత్రం ఆ సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమా తర్వాత కృష్ణ మరిన్ని ప్రయోగాలు చేసారు. ఇక అక్కడి నుంచి కూడా అగ్ర హీరోలు సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి సిద్దమయ్యారు. 

 

బాలీవుడ్ హీరోలు కూడా కృష్ణ ను చూసి ఎన్నో నేర్చుకున్నారు  అంటారు. ఆయన సినిమాలు ఆ విధంగా ఆకట్టుకున్నాయి మరి. అయితే ఆయన స్థాయిని చాలా మంది అందుకోలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. ఆయన రేంజ్ ని అందుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు అని, ఎన్టీఆర్ ఒక్కరే ఆ రేంజ్ కి వెళ్ళారు అని కొన్ని కొన్ని విషయాల్లో అంటారు. ఆ విధంగా కృష్ణ తన ప్రభావం చూపించారు తెలుగులో. చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: