టాలీవుడ్ లో కృష్ణ కు ఉన్న పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమాలు ఆయన నటన కూడా టాలీవుడ్ లో ఒక సంచలనం. ఇక ఆయన తో సినిమా చేయడానికి గానూ చాలా మంది హీరోయిన్ లు పోటీ పడిన సందర్భాలు ఉండేవి. ఆయన తన మార్క్ ని ప్రత్యేకంగా చూపించే వారు. దీనితో కృష్ణ పక్కన సినిమా చేస్తే హీరోయిన్ రేంజ్ భారీగా పెరిగేది. అందుకే  ఆయన తో సినిమా చేయడానికి శ్రీదేవి కూడా ప్రయత్నాలు చేసారు అని అంటారు. శ్రీదేవి కెరీర్ లో కృష్ణ తో చాలా మంచి సినిమాలు చేసారు. 

 

ఇద్దరి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలు రాగా వాటిల్లో దాదాపు సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయి అని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది అప్పట్లో. దర్శక నిర్మాతలు కూడా వారి కాంబినేషన్ లో సినిమా చేస్తే కాసుల పంట అని భావించి ఎక్కువగా సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కృష్ణ చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చారు.  కృష్ణ కు బాగా పేరు తీసుకొచ్చిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఆయన తో సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ లో కూడా వెళ్ళారు. 

 

కృష్ణ సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రాధాన్యత అనేది ఉండేది. ఆమెకు మంచి ప్రాధాన్యత సెట్స్ లో కూడా కృష్ణ ఇచ్చే వారు అని అంటారు.  అయితే వారిద్దరి మధ్య ఒక హీరో కారణంగా విభేదాలు కూడా వచ్చాయి అని చాలా మంది అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేసారు అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: