ఒక హీరో నిర్మాత అవ్వాలి అంటే కచ్చితంగా ధైర్యం ఉండాలి. అప్పుడే ఏ విధంగా అయినా సరే ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రయోగాలు చేసినా సాహసాలు చేసినా సరే వారికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ప్రయోగాలు చేయకపోతే మాత్రం కనీస౦ వారిని పట్టించుకునే ప్రయత్న్నం కూడా ఎవరూ చేయరు కూడా.  ఈ విషయాన్ని ముందే గ్రహించిన కృష్ణ... తనలో ఉన్న అన్ని ప్రత్యేకతలను చాటుకునే వారు. ఏ ప్రయోగం అయినా సరే ఆయన చేయడానికి ముందుకు వచ్చే వారు. ఆయన తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ముందుకు వచ్చే వారు.

 

ఇక ఆయన నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసారు. పద్మాలయా స్టూడియో ద్వారా ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలకు దేశ వ్యాప్త గుర్తింపు వచ్చింది తన సినిమాలను  తానే కృష్ణ నిర్మించుకునే వారు. ఇక అది చూసిన ఇతర హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్ళు కూడా నిర్మాతలుగా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. ఆయన చాలా వరకు తన సినిమాలను తానే నిర్మించుకున్న సందర్భాలు ఉన్నాయి. 

 

ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఏది కావాలో అది తెలుసుకుని అది అందించే ప్రయత్నం ఎక్కువగా చేసారు కృష్ణ. దీని తోనే ఆయనకు ఒక ప్రత్యేక ఆదరణ అనేది ఉండేది అప్పట్లో. ఆ విధంగా కృష్ణ తన ప్రభావం చూపించారు. నిర్మాతగా ఆయన ఏది చేసినా సరే ఒక సంచలనం అప్పట్లో. విజయ నిర్మలతో కలిసి ఆయన చేసిన సినిమాలు అవి సాధించిన విజయాలు ఇప్పటికి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్థాయిలో అవి విజయం సాధించాయి అని చెప్పవచ్చు. ఆయనను చూసే హీరోలు నిర్మాతలు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: