ఇటీవల లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం కొన్ని ఆంక్షలు సడలింపులు ఇస్తున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇటీవల తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపటం జరిగింది. కరోనా వైరస్ కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తో షూటింగులు చేయాలి ? సినిమా హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఓపెన్ చేయాలి ? ఇలా అనేక విషయాల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరపడం జరిగింది. అయితే ఈ చర్చలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుండి నాకు పిలుపు రాలేదని బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

IHG

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణా ప్రభుత్వంతో ఇండస్ట్రీ చర్చలు జరుపుతున్నట్లు కేవలం తనకు వార్తల ద్వారా మరియు పత్రికల ద్వారా మాత్రమే తెలుస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మెల్లమెల్లగా షూటింగ్ లకు అనుమతి ఇస్తారని తెలిసింది అని అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ‘‘చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్‌ యాదవ్‌తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు’’ అంటూ అలిగినట్లు బాలయ్య మాట్లాడారు.

IHG's Mental <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEALTH' target='_blank' title='health-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>health</a> | Gulte - Latest ...

అయితే ఈ విషయం తెలుగు రాజకీయాల్లోనూ, సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కానీ ఇక్కడ విషయం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపింది సినిమా నిర్మాతలు అని అందువల్లే బాలయ్య బాబుని పిలవలేదని కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని బాలయ్య బాబు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అంటున్నారు. అసలు బాలయ్య బాబు కి అవమానం జరిగితే ఎవరు ఊరుకోరని… ఆయన రావాల్సిన సమావేశం కాదని చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: