నిర్మాతగా హీరోగా ఎవరు చేయని విధంగా టాలీవుడ్ లో కృష్ణ సాహసాలు చేసారు అనేది వాస్తవం. ఆయన సినిమాలు ఆయన నటన ఏ రేంజ్ లో ప్రేక్షకులకు వెళ్ళాయో ఆయన చేసిన సాహసాలు కూడా సినీ పండితులకు వెళ్ళాయి. ఎవరూ కూడా ప్రయోగాలు చేయడానికి ముందుకు రాని రోజుల్లో ఆయన ముందుకు వచ్చి ప్రయోగాలు చేసారు. ఇక ఆయన సినిమాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఆయన పద్మాలయా స్టూడియోస్ ని స్థాపించి అప్పట్లోనే సంచలనం సృష్టించారు.

 

ఒక హీరో ముందుకి వచ్చి ఈ స్థాయిలో ఒక స్టూడియో నిర్మాణం చేయడం అదే. ఇక అందులో వచ్చిన ఎన్నో సినిమాలు చాలా బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రతీ సినిమా కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. అగ్ర హీరోలు కూడా అందులో సినిమాలు చేసారు. అయితే అప్పట్లో ఎక్కువగా కృష్ణ కుటుంబం సినిమాలే ఉండేవి. విజయ నిర్మల కూడా అందులో ఎక్కువగా సినిమాలు చేసారు. అందులో టాలీవుడ్ చరిత్రను మార్చిన సినిమాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కృష్ణ ఆ స్టూడియో ద్వారా తనలో ఉన్న సత్తాని సినీ ప్రపంచానికి చాటారు అనే వ్యాఖ్యలు వినిపించాయి. 

 

ఇక అది అలా ఉంటే కృష్ణ అందులో చేసిన సినిమాలను ఎక్కువగా తమిళ దర్శకులు కొనే వాళ్ళు. అక్కడ కృష్ణ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. ఎవరూ సాధించలేని విజయాలు సాధించాయి ఆయన సినిమాలు అనేది వాస్తవం. ఆ విధంగా కృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. హీరో గా అయినా నిర్మాతగా అయినా సరే ఆయన ఎన్నో మంచి సినిమాలను చేసి ప్రేక్షకులకు అందించారు. ప్రతీ సినిమా కూడా ఒక రేంజ్ లో నిలిచింది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: