లాక్ డౌన్ లో చాలా మంది తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు అనే చెప్పాలి. చాలా మందికి ఇప్పుడు ఏది చెయ్యాలి అన్నా సరే భయం గానే ఉంది. దీనితో వ్యాపారాలు కూడా భారీగా మూతపడ్డాయి. ప్రతీ  ఒక్కరు కూడా ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాక ఆత్మహత్యలు చేసుకుందామా అనే విధంగా కూడా ఆలోచనలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆకలి వేస్తున్నా అన్నం పెట్టే దిక్కు లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 

 

ఈ నేపధ్యంలోనే ఎవరికి వారు గా తమ వంతు సేవ చేస్తున్నారు. ప్రధానంగా హీరోయిన్ ప్రణీత అయితే స్వయంగా వలస కార్మికులకు సహా పనులు లేని వారికి ఆహారం అందించే కార్యక్రమలాను సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఇటీవల ఆమె సేవా కార్యక్రమాలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనపడుతున్నాయి స్టార్ హీరోలు నిర్మాతలు కూడా చేయలేని విధంగా ఆమె సేవా కార్యక్రమాలను చేస్తున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమెకు పెద్దగా సినిమాలు లేవు అనే సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఆమె చేతిలో సినిమాలు లేవు అని చెప్పాలి. అయినా సరే ఆమె మాత్రం సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. 

 

దీనిపై ఆమెను చాలా మంది అభిమానందిస్తున్నారు. ఆమె స్వయంగా వెంట చేస్తున్న వీడియో లు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆమె చాలా వరకు సేవా కార్యక్రమాలతో లాక్ డౌన్ ని దాదాపుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు సహాయం చేసినా లేకపోయినా ఆమె మాత్రం తన మంచి మనసు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: