కరోనాపై పోరాటం విషయంలో ఇప్పుడు ఎవరికి వారుగా స్వచ్చందంగా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సేవా కార్యక్రమాలను కొనసాగించే విషయంలో ఎవరూ కూడా వెనక్కు తగ్గే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక హీరోలు హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అందులో హీరోయిన్ ల విషయానికి వస్తే ప్రణీత ది బెస్ట్ హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. అవును ఆమె ఇప్పుడు చేతిలో సినిమాలు లేకపోయినా సరే సేవా కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

ఆమెకు ఆఫర్లు రావడం లేదు. అయినా సరే వందల మందికి ఆమె భోజనం అందిస్తూ పెద్ద మనసు చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఫోటోలు వీడియో లు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె చాలా మంది స్టార్ హీరోయిన్ లకు హీరోలకన్నా బెటర్ అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె సినిమాలు  ఈ మధ్య మన తెలుగులో లేవు. ఇక ఆ తర్వాత సమంతా కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

10 స్వచ్చంద సంస్థలకు ఆమె ఇటీవల సహాయం చేసారు. ఇప్పటికే సమంతా సేవా కార్యక్రమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక కరోనా పై సాయం విషయంలో కూడా ఆమె ముందుకు వచ్చారు. అన్ని విధాలుగా ఆమె అండగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారు. భర్త నాగ చైతన్య తో సంబంధం లేకుండా ఆమె ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించడం విశేషం. కాగా ఆమె పుష్ప సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె నటిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: