సూప‌ర్ ‌స్టార్ కృష్ణ బ‌ర్త్ డే కానుక‌గా మ‌హేష్‌బాబు 27వ సినిమా టైటిల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. ప్రీ లుక్ కూడా రిలీజ్ కావ‌డం.. ఈ లుక్ కేవ‌లం మ‌హేష్ ఫ్యాన్స్‌కే కాకుండా టోట‌ల్ తెలుగు సినిమా అభిమానులు అంద‌రికి పిచ్చ కిక్ ఇచ్చేలా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో మైండ్ బ్లాక్ అయ్యే రేంజులో దూసుకు పోతోంది. ఈ సినిమా టైటిల్ ముందు నుంచి అనుకున్న‌దే ప్ర‌క‌టించినా ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై అప్పుడే అంచ‌నాలు ప్రారంభ‌మ‌‌య్యాయి.  

 

ఇక ఫ్రీ లుక్ తోనే స‌ర్కారు వారి పాట దుమ్ము రేప‌డంతో పాటు పిచ్చ కిక్ ఇచ్చింది. అయితే ఫ్రీ లుక్‌లో మ‌హేష్ లుక్ పూర్తిగా రివీల్ చేయ‌లేదు. ఓ వైపు చెవికి రింగుతో పాటు ర‌ఫ్ గా కాస్త మాసిన గెడ్డంతో క‌నిపిస్తున్నాడు. బ్లాక్ ష‌ర్ట్ వేసుకుని ఉన్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ కు మెడ‌మీద ఉన్న టాటూకు, చెవి రింగుకు ఏదో లింక్ అయితే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ పాయింట్ సినిమాలో కీల‌కం కానుంద‌ని స‌మాచారం. అప్పుడు ఈ సినిమా క‌థ ఇదే నంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని లైన్లు కూడా చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఏదేమైనా ప‌చ్చి మాస్ లుక్‌తోనే దంచేసిన మ‌హేష్ బాబు ప‌ర‌శురాం రేపు సినిమా రిలీజ్ అయ్యాక బొమ్మ‌ను ద‌ద్ద‌రిల్లిపోయేలా చేసేలా వాతావ‌ర‌ణం అయితే క్రియేట్ చేసుకున్నారు.

 

ఈ సినిమాలో మ‌హేష్ మూడు ఏజ్‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. కాలేజ్ బాయ్‌.. యంగ్ ఏజ్‌.. మిడిల్ ఏజ్‌ల‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంతో పాటు సినిమా యూనిట్ వేట మొద‌లు పెట్టింది. మ‌హేష్ బాబుతో మ‌హ‌ర్షి సినిమాలో న‌టించిన పూజా హెగ్డే ప‌రిశీలిస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఇటీవ‌ల తిరుగులేని ఫామ్‌తో ఉన్న థ‌మ‌న్‌నే మ‌రోసారి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: