సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న మ‌హేష్‌బాబు 27వ సినిమా ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. మ‌హేష్ తండ్రి సీనియ‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. వాస్త‌వానికి ఈ సినిమా టైటిల్ స‌ర్కారు వారి పాట అంటూ కొద్ది రోజులుగా లీకులు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ  లీకుల‌ను నిజం చేస్తూ ఈ సినిమాకు అదే టైటిల్ క‌న్‌ఫార్మ్ చేశారు. ఈ సినిమాకు ముందు నుంచి ఊహించిన‌ట్టుగానే గీతా గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

 

మ‌హ‌ర్షి సినిమా టైప్‌లోనే ఏకంగా మూడు పెద్ద సంస్థ‌లు క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయన్న‌ది పోస్ట‌ర్లోనే ప్ర‌క‌టించేశారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే చాలా రోజుల త‌ర్వాత మ‌హేష్ కంప్లీట్ మాస్ క్యారెక్ట‌ర్లో క‌నిపించ‌నున్నాడా ? అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. చెవికి పోగు.. మెడ మీద ట్యాటూ తో ఫేస్ కాస్త క‌నిపించి క‌నిపించ‌కుండా ఉంది. ఇక లుక్‌లో మ‌హేష్ హెయిర్ స్టైల్ చూస్తే పోకిరి సినిమాలో హెయిర్ స్టైల్ గుర్తుకు రాక మాన‌దు. పోకిరీ సినిమాలో మ‌హేష్ లుక్స్‌, మేన‌రిజం ఊర‌మాస్ స్టైల్లో ఉంది. ఇప్పుడు స‌ర్కారు వారి పాట లుక్ ఖ‌చ్చితంగా పోకిరీని మించేలా ఉంద‌న్న టాక్ అయితే వ‌చ్చేసింది.

 

అయితే సోలో, గీతా గోవిందం లాంటి క్లాస్ క‌థ‌ల‌తో హిట్లు కొట్టిన ప‌ర‌శురాం.. ఇప్పుడు మ‌హేష్ లాంటి సూప‌ర్ స్టార్ హీరోను ఫ‌స్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అది కూడా ఊర‌మాస్ టైటిల్ వ‌దిలాడు. దీంతో స‌హ‌జంగానే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా ఎలా ?  ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. టైటిల్‌, లుక్‌తోనే అంద‌రిలోనూ ఆస‌క్తి పెంచేశాడు మ‌హేష్‌. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: