మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏ. ఓదెలు పోలీస్ క్వార్టర్స్ బిల్డింగ్ పైకి ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ దుర్ఘటన ఈ రోజు అనగా ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బోధ్ మండలం క రత్వాడ గ్రామానికి చెందిన ఓదెలు ప్రభుత్వం తనకు కేటాయించిన జన్నారం మండలం లోని పోలీసు క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో తన పోలీస్ క్వార్టర్స్ కి వచ్చి ఇటీవల నిర్మించిన ఒక షెడ్ కి నీళ్లు పెట్టాడు. 


షెడ్ కి వాటర్ పోసే క్రమంలో తాను క్వార్టర్స్ భవనం పైకి ఎక్కాడు. అయితే దురదృష్టవశాత్తూ కాలుజారి భవనం పైకప్పు నుండి కింద పడ్డాడు. తాను కిందికి పడే క్రమంలో గొంతుకి ఒక రేకు కోసుకుపోయింది. దాంతో తన మెడ నుండి తీవ్రంగా రక్తస్రావం అవడం తో అక్కడికక్కడే అతను మరణించాడు. ఏఎస్ఐ కిందపడ్డాడన్న విషయం తెలుసుకున్న క్యార్టర్స్ లోని పోలీసు సిబ్బంది హుటాహుటిన అతడిని మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తాను తన తుది శ్వాస విడిచాడు. చనిపోయిన ఏఎస్ఐ కి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.


లక్షెట్టిపేట ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్, వినోద్ నాయక్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ... అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కిందపడే క్రమంలో అతని గొంతులో ఏదో పదునైన వస్తువు గుచ్చుకుపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు', అని చెప్పారు. మే 3వ తారీఖున ఆలేరు మండలం లో రిజర్వు పోలీసు ఇన్స్పెక్టర్ కారు ప్రమాదంలో చనిపోయాడు. హైదరాబాద్ నుండి వరంగల్ కి వెళ్తున్న క్రమంలో కారు టైరు పంచర్ కావడంతో ఒకేసారి కారు యు టర్న్ తీసుకొని పల్టీలు కొట్టగా డ్రైవింగ్ చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ తలకు తీవ్ర గాయాలై మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: