ఒక సినిమాను చెయ్యాలి అంటే నిర్మాత, దర్శకుడు ఎంత కష్టపడతారో హీరో కూడా అదే స్థాయిలో కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే దర్శకుడి కంటే ముందు బాధ పడేది ఎక్కువగా హీరోనే. దర్శకుడి దగ్గర మంచి కథ ఉంటే హీరో అయినా సరే ఆదరించే అవకాశం ఉంటుంది. హీరో సినిమా ఒకటి ఫ్లాప్ అయింది అంటే అతను పడే కష్టం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు రామ్ విషయంలో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. వరుస ఫ్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో రామ్ లైన్ లోకి వచ్చాడు. 

 

వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక సినిమాను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. రెడ్ అనే సినిమాలో అతను నటించాడు. ఈ సినిమా మీద అతను చాలా ఆశలు పెట్టుకుని సినిమా కోసం చాలా కష్టపడ్డాడు రామ్. ఇప్పుడు దీనిని నిర్మాత దర్శకుడు ఇద్దరూ కూడా ఆన్లైన్ లో విడుదల చేస్తామని చెప్తున్నారు. దీని తో రామ్ పైకి చెప్పుకోలేని విధంగా బాధ పడుతున్నాడు అని సమాచారం. అతనికి అసలు ఏ మాత్రం కూడా అలా విడుదల చేయడం ఇష్టం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

రామ్ ఇప్పుడు ఈ సినిమాను ఆన్లైన్ లో విడుదల చేయవద్దు అని దర్శకుడికి నిర్మాతకు స్పష్టంగా చెప్పాడు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఈ సినిమాను మాత్రం ఆన్లైన్ లో విడుదల చేసేలా అయితే తన పేరు వాడవద్దు అని చెప్పేసాడు అని సమాచారం. అలాగే ఈ సినిమా పారితోషికం కూడా వెనక్కు ఇచ్చేస్తాను నాకొద్దు అని చెప్పాడట. తాను అంత చిన్న హీరో కాదని మొహం మీదే చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: