అల్లు అర్జున్ సినిమా అనగానే తెలుగులో జనాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాల కోసం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే ఇక అమ్మాయిలూ అయితే పనులు మానుకుని మరీ చూసే ప్రయత్నం చేస్తారు. ఇక ఇప్పుడు అతను పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అతని అభిమానులకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అనే సంగతి తెలిసిందే. అది ఎందుకు నచ్చలేదు అంటే అతని నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలను మాత్రమే వారు ఆశించారు. 

 

ఇక మహిళా అభిమానులు అయితే అతన్ని అలా చూడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సుకుమార్ కథ విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది చాలా మంది మాట గా చెప్పవచ్చు. ఇప్పుడు కథలో మార్పులు చేసి అతని పాత్రను పూర్తిగా మార్చే ఆలోచనో ఉన్నాడని సమాచారం. బన్నీ కూడా కాస్త గ్లామర్ ఉంటే బాగుంటుంది అని చెప్పాడు అని అందుకే సుకుమార్ కూడా అవసరం అయితే రెండో పాత్ర కూడా ఈ సినిమా కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. 

 

అతను ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా వరకు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఏ సినిమా కోసం కూడా ఈ స్థాయిలో కష్టపడలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా కొందరి నటుల ఎంపిక విషయంలో ఆయన బాగా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా మంది మాట. ఎవరిని తీసుకోవాలో అర్ధం కాని స్థితిలో ఆయన ఉన్నారు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దర్శకులు. లేకపోతే మాత్రం ఇబ్బంది వచ్చేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పుడు సుకుమార్ బాగా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: