మహేష్ సినిమాల మీద వార్నర్ కి ఎందుకు అంత ఆసక్తి...? దీని మీద ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది అవును ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్కువగా మహేష్ బాబు సినిమాల మీద ఫోకస్ చేసి వీడియో లు చేయడం పాటలు పాడటం డైలాగులు చెప్పడం తో బాబు కి ఎందుకు అంత ఆసక్తి అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. కారణం ఏంటీ అనేది తెలియదు గాని మహేష్ బాబు మాత్రం ఇప్పుడు వార్నర్ తో స్నేహం చేస్తున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. వార్నర్ ని ఒక సినిమాలో మహేష్ బాబు తీసుకునే అవకాశం ఉంది అనేది కొందరు చెప్పే మాట. 

 

ఏమో గాని ఇప్పుడు మాత్రం వార్నర్ చేస్తున్న పాటలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పని లేక ఖాళీ గా ఉన్న వార్నర్ ఇప్పుడు అదే విధంగా వీడియో లు చేస్తూ వస్తున్నాడు. అతని పాటలు అతని డాన్స్ లు ఎక్కువగా మహేష్ సినిమాలకు ఉండటం తో మహేష్ బాబు ఇప్పుడు అతనిని తీసుకుని తన సినిమాలకు ఆస్ట్రేలియా లో పాపులారిటి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు. అక్కడ మన తెలుగు వారు ఎక్కువగానే ఉన్నారు. దీని తో అక్కడి వారికి మన సినిమాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంది. 

 

ఇక ఇప్పుడు వార్నర్ బాబు హడావుడి చూసిన జనాలు అయితే ఇక మహేష్ బాబు క్రేజ్ ని తెలుగులో తను వాడుకోవాలని మహేష్ బాబు ఏమో ఆస్ట్రేలియా లో అతని క్రేజ్ ని వాడుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిజం ఎంత అనేది తెలియకపోయినా ప్రచారం మాత్రం ఇప్పుడు బాగా జరుగుతుంది. కాగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: