ప్రస్తుతం భారతదేశంలో నాలుగో సారి లాక్ డౌన్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అనేక పరిశ్రమలు మూత పడ్డాయి అన్న సంగతి అందరికీ విధితమే. ముఖ్యంగా క్రీడారంగం, రవాణా రంగం, ఆటోమొబైల్ రంగం, సినీరంగం... ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి రంగంలో కుంటు పడిందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా రంగం విషయానికొస్తే గత 80 రోజుల నుంచి అన్ని సినిమా షూటింగ్ లు అన్ని ఇండస్ట్రీలలో ఆపేశారు. అయితే కొన్ని రాష్ట్రాల సినీ వర్గాలు ప్రభుత్వ అధికారులు చర్చల కారణంగా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగు ప్రారంభం కాబోతున్నాయి.

 

అసలు విషయంలోకి వెళ్తే.. లాక్ డౌన్ కారణంగా అక్కినేని కోడలు అక్కినేని సమంత ఇంటికే పరిమితమయ్యారు. ఇదివరకే సమంత నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతుంది. అయితే ఈ పోటీ ఫ్లాట్ ఫామ్ లో మొదటిసారి సమంత కనువిందు చేయబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఒక పని చేస్తోంది. ఈ వెబ్ సిరిస్ కొరకు హిందీలో తన పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెప్పనుంది.

 


ఇకపోతే ఈ విషయంపై హిందీలో తన ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఈ వెబ్ సిరీస్ లో ఒక నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా వివిధ భాషల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్, కృష్ణ డీకే సంయుక్తంగా తెరకెక్కించారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: