మహేశ్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమా సందర్భంగా పరశురామ్ కు విశెష్ చెప్తూ మహేశ్ కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మహేశ్ కూడా పూరితో వర్క్ చేయాలని ఉంది ఇన్స్టా చాట్ లో అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పోయాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమే అనిపిస్తోంది. ప్రిన్స్ మహేశ్ ను సూపర్ స్టార్ మహేశ్ చేసింది పూరి తీసిన ‘పోకిరి’నే. ఆ సినిమాను సినీ ప్రేమికులు అంత తేలిగ్గా మర్చిపోరు. మహేశ్ కెరీర్ ను కొత్త పాత్ లోకి నెట్టింది ఈ సినిమా.

IHG

 

తర్వా బిజినెస్ మేన్ కూడా సినిమా కూడా వచ్చింది. జణగణమణ కథను మహేశ్ తో చేస్తున్నట్టు పూరి చెప్పాడు. మళ్లీ సినిమా ఖాయమనుకుంటే మహేశ్ నుంచి సమాధానం రాకపోవటం పూరిని నిరాశపర్చింది. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈలోపు పూరి వరుస ఫ్లాపుల్లోకి వెళ్లిపోయాడు. ‘హిట్లలో ఉంటేనే మహేశ్ పట్టించుకుంటాడు.. తనతో సినిమా చేసే అవకాశాలు లేవు’ అని కూడా అన్నాడు పూరి. మహర్శి ప్రీరిలీజ్ లో తనకు హిట్లిచ్చిన డైరక్టర్స్ పేర్లు చెప్పిన మహేశ్ పోకిరి ఇచ్చిన పూరి పేరు మాత్రం చెప్పలేదు.

IHG

 

దీంతో ఇక ఈ కాంబినేషన్ కు తెర పడినట్టే అనుకుంటే.. మళ్లీ తెర లేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు జరిగిన పరిణామాలే ఇందుకు ఉదాహరణ. ఇదే జరిగితే మహేశ్ అభిమానులకు ఇంతకంటే మంచి వార్త మరొకటి ఉండదు. ఎప్పటినుంచో వారి ఎదురుచూపులు ఈ కాంబినేషన్ పైనే. హీరోల్లో మహేశ్.. దర్శకుల్లో పూరి జగన్నాధ్ కు స్పెషల్ స్టైల్ ఉంది. మరి.. వీళ్లిద్దరూ కలిసి మళ్లీ మ్యాజిక్ చేస్తారా.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: