యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా 2021 లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ పాన్ ఇండియా సినిమాలో ఆలియా భట్, ఓలియా మెరీస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ సినిమాని త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ  (చినబాబు) - నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

 

ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నప్పటికి విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇది అసలు చిత్ర యూనిట్ అనుకుంటున్న టైటిల్ మాత్రం కాదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడన్న న్యూస్ ఈ మధ్య బాగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇది గనక నిజమైతే మరోసారి ఎన్టీఆర్ ని డ్యూయెల్ రోల్ లో చూడొచ్చు. గతంలో v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ తెరకెక్కించిన 'అదుర్స్', పూరి తెరకెక్కించిన 'ఆంధ్రావాలా' సినిమాల్లో డ్యూయెల్ రోల్ లో నటించిన ఎన్టీఆర్ 'జైలవకుశ' సినిమాలో మూడు పాత్రల్లో అదరగొట్టాడు.

 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారన్న టాక్ కూడా ఉంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ సోదరుడు నందమూరి హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

కాబట్టే ఈ సినిమాలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తే అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఇలా అనుకుంటున్నట్టు సమాచారం. అందుకు త్రివిక్రమ్ ప్రత్యేకంగా సినిమాలో బాగా హైలెట్ అయ్యోలా ఒక క్యారెక్టర్ రాస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ ... అధికారకంగా ప్రకటన ఇచ్చినప్పుడు సర్‌ప్రైజ్ గా రివీల్ చేయాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: