తెలుగు సినిమా మళ్ళీ సరైన దారిలోకి రాబోతోంది. ఇన్నాళ్ళు నేల విడిచి సాము చేసిన వారంతా ఇపుడు కరోనా పుణ్యామని దారికి వస్తున్నారు. ఒక చిన్న పాట తీయాలంటే కూడా విదేశాలకు చెక్కేసే కల్చర్ నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

 

ఇపుడు ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారితో సతమతమవుతోంది. అంత సులువుగా ఎక్కడా షూటింగులకు అవకాశాలు దొరకవు. అదే విధంగా గతంలో మాదిరిగా రానూ పోనూ రాకపోకలు విమానాల్లో సాగించడానికి కూడా కుదరదు. ప్రతీ దేశంలోనూ విదేశీ ప్రయాణీకుల మీద ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే వారి దేశం, ఆరోగ్యం ముఖ్యం కాబట్టి.

 

ఇదిలా ఉండగా సినిమా షూటింగులు విదేశాల్లో అంటే సినిమా వారికి కూడా ఎవరి భయాలు వారికి ఉండనే ఉన్నాయి. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ కూడా షూటింగుల విషయంలో ఇదే విధానంగా ఉంటుంది. ప్రతీ చోటా పర్మిషన్లు తీసుకుని షూటింగులు జరుపుకునే లోగా అసలు టైం గడచిపోతుంది.

 

దీంతో వీలున్నంతలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి పర్మిషన్లు తెచ్చుకుని షూటింగులు చేసుకుంటే టైం కలసివస్తుందని, కొత్త తలనొప్పులు కూడా ఉండవని భావిస్తున్నారు. అదే విధంగా తక్కువ ఖర్చుతో కూడా సినిమాలు పూర్తి అవుతాయని అంటున్నారు.

 

గతంలో మన సినిమాలు అన్నీ కూడా గోదావరి గట్టు మీద, విశాఖ బీచ్ వద్ద షూటింగులు జరిగేవి. అందువల్ల ఇపుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేలా కనిపిస్తోంది. మొత్తానికి మన అందాలను ఇకపైన తెర మీద చూసేందుకు అవకాశం వస్తుందని అంటున్నారు.

 


గతంలో దాసరినారాయణరావు. కె విశ్వనాధ్, కె బాలచందర్ వంటి వారు ఎక్కువగా ఆంధ్రా ప్రాంతంలోనే సినిమాలు తీసేవారు. అవి మంచి హిట్లు కూడా అయ్యాయి. అయితే రాజమండ్రీ, లేకపోతే విశాఖకు వచ్చి షూటింగులు  జరుపుకునేవారు. మొత్తానికి ఆ సినిమాలు ఇపుడు వచ్చినా కూడా అంతా చూస్తారు. ఇపుడు కూడా సినిమాలు ఇక్కడే షూటింగు చేస్తే జనాలకు ఆసక్తి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: