సహజ నటి జయసుధ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురం సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా పరిచయం అయిన జయసుధ, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన విషయం తెలిసిందే. అన్న ఎన్టీఆర్ దగ్గరి నుండి మొన్నటి తరం హీరోలైన మోహన్ బాబు, చంద్ర మోహన్ వరకు దాదాపుగా అందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు జయసుధ. 

IHG

మొదటి నుండి తాను ఎంచుకునే పాత్రల్లో ఒదిగిపోయి పరకాయ ప్రవేశం చేసే అలవాటుండడంతో రాను రాను ఆమె నటనకు మెచ్చిన ప్రేక్షకులు ఆమెను సహజనటి అని పిలిచేవారు. ఆ తరువాత నుండి ఎన్నో అవకాశాలు, తద్వారా విజయాలు సొంతం చేసుకున్న జయసుధ అప్పటి టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగారు. ఇంచుమించి జయప్రద, జయసుధ ఒకే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే జయసుధ హీరోయిన్ గా నటించిన సినిమాల్లో దాదాపుగా ఎక్కడా కూడా ఏ మాత్రం అసభ్యతకు కానీ, స్కిన్ షో కు కానీ అవకాశం ఇవ్వని విధంగా, అలానే ఎక్కువగా తన పాత్రలలోని నటన ద్వారా ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం జరిగింది. 

 

అప్పట్లో జయసుధ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆమె చక్కటి కట్టు, బొట్టు, నడవడిక ను చూసేందుకు అమ్మాయిలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా సినిమా చూసేందుకు థియేటర్స్ కు వచ్చేవారట. ఆపై కొన్నాళ్ల తరువాత ఎక్కువగా అక్క, వదిన పాత్రలు పోషించిన జయసుధ, ఇప్పటికీ కూడా సినిమాల్లో అమ్మ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిని గెలుచుకుంటున్నారు. ఇక మొదటి నుండి ఎక్కువగా సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రల్లో నటించచడం, అలానే ఎక్కువగా ఆయా పాత్రల ద్వారా ప్రేక్షకులను చేరువవ్వడం వలనే తనకు మంచి పేరు దక్కిందని అంటుంటారు జయసుధ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: