ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా దాదాపుగా పదమూడేళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇచ్చారు ఒకప్పటి ప్రఖ్యాత నటి విజయశాంతి. ముందుగా సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి నటి గా పరిచయమైన విజయశాంతి, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ, నటిగా తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. అప్పట్లో దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో నటించిన గొప్ప పేరు విజయశాంతి సొంతం. 

IHG

నేటి సీనియర్ హీరోలు, అప్పటి యువ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి నుండి విలక్షణ నటుడు చంద్రమోహన్ వరకు దాదాపుగా అందరూ హీరోల సరసన హీరోయిన్ గా నటించారు విజయశాంతి. అయితే కెరీర్ మొదట్లో ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అక్కడక్కడా నటించిన విజయశాంతి, ఆపై మధ్యలో కొన్ని సినిమాల్లో యూత్ ని ఆకట్టుకునే రొమాంటిక్ పాత్రల్లో కూడా నటించారు. అయితే హీరోయిన్స్ అందరిలో విజయశాంతి కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మంచి అందంతో పాటు ఫిజిక్ కలిగిన విజయశాంతి, ఎక్కువగా చీరకట్టు, లంగావోణీ వంటి దుస్తులతో పాటు ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ లో కూడా ఎంతో అదిరిపోయేవారు. 

 

అప్పటి యువతలో విజయశాంతి కి మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉండడం, ఆమె నటనతో పాటు అందం, స్టైల్ కూడా వారిని ఎంతో ఆకర్షించేది. ఇక ఆ తరువాత రాను రాను వరుసగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిన విజయశాంతి, 90వ దశకం సమయంలో అదిరిపోయే అప్పటి లేటెస్ట్ ఫ్యాషన్ చీరకట్టుతో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునే వారు. ఆ విధంగా తన కెరీర్ లో అటు ట్రెడిషనల్ లుక్ లోను, ఇటు ఫ్యాషనబుల్ లుక్ లోనూ అదరగొట్టి యువతను ఉర్రూతలూగించిన విజయశాంతి కొద్దిపాటి లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తుల్లో కొంత మేర ఎక్స్ పోజింగ్ ప్రదర్శించారు అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: