సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తరువాత అవకాశాలు మెల్లగా సంపాదించి ఆపై హీరోయిన్ గా కొనసాగాలి అంటే కొద్దిపాటి పద్దతులను హీరోయిన్లు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడంతో పాటు ఎక్కడికక్కడ లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ట్రెండీ స్టయిల్ లో దుస్తులు ధరించడం, అలానే అవసరం అనుకుంటే కొన్ని కొన్ని సీన్స్ లో ఎక్స్ పోజింగ్ కూడా చేయవలసి వస్తుంది మరి. అయితే హీరోయిన్ల లో కొందరు సీన్స్ డిమాండ్ మేరకు ఎక్స్ పోజింగ్ చేయడానికి సిద్ధం అయితే, మరికొందరు మాత్రం ఒకింత హాట్ గా కనపడడానికి ఇష్టపడుతుంటారు. 

IHG

అయితే వీరందరికీ కొంత భిన్నంగా ఎక్కువగా ఎక్స్ పోజింగ్ వంటివి చేయకుండా తమలోని నటన, ఆకట్టుకునే అందంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని ముందుకు సాగేలా కెరీర్ ని ప్లాన్ చేసుకునే వారు కూడా అక్కడక్కడా ఉన్నారు. కాగా అటువంటి హీరోయిన్ల లో దివంగత సౌందర్య కూడా ఒకరు అనే చెప్పాలి. కెరీర్ లో ఎన్నో మంచి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన సౌందర్య అంటే అప్పటి ప్రేక్షకుల్లో వల్లమాలిన అభిమానం. ఒకప్పటి మహానటి సావిత్రి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సౌందర్య, ఎక్కువగా ప్రేక్షకుల హృదయాలను తాకే పాత్రల్లో నటించడానికే మొగ్గుచూపేవారు. నిజానికి తనకు దర్శక నిర్మాతల కోరిక మేరకు, అలానే కొన్ని సీన్స్ డిమాండ్ బట్టి ఎక్స్ పోజింగ్ చేయడంలో పెద్దగా అభ్యంతరాలు లేవని ఒకానొక సమయంలో వెల్లడించిన సౌందర్య, తనకు వ్యక్తిగతంగా మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించాలనే అభిలాష ఉందని చెప్పడం జరిగింది. 

 

అదే విధంగా ఆమె దాదాపుగా నటించిన చాలావరకు సినిమాలు కూడా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే దక్కడం జరిగింది. ఆ విధంగా ఎక్స్ పోజింగ్ కంటే నటనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగి స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు గడించిన సౌందర్య ప్రస్తుతం మన మధ్య లేనప్పటికీ ఆవిడ నటించిన ఎన్నో గొప్ప సినిమాలు, పోషించిన పాత్రలు మన తెలుగు వారు ఎప్పటికీ మరిచిపోలేరు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: