టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. వరుస సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఆమె నటనకు ఆమె డాన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ఆమె చేసిన ఫిదా సినిమా ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక ఆమె చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏ భాష లో సినిమా చేసినా సరే ఆమె గుర్తింపు మాత్ర౦ అదే విధంగా ఉంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఆమె గురించి మాట్లాడుకుంటే... ఆమెకు అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా స్కిన్ షో అనేది చేసిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఏ సినిమాలో ఆమె నటించినా సరే చాలా పద్దతిగా దుస్తులు వేసుకుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె నటన తో పాటుగా ఆమె స్కిన్ షో కూడా చేయకపోవడం తో ఆమె సినిమాలను ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఎక్కువగానే చూడటం మొదలుపెట్టారు అని చెప్పవచ్చు. 

 

ఆమెకు సగం పేరు అదే విధంగా వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత ఆమె కన్నడం లో ఒక భారీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తనకు అవకాశం రాకపోయినా పర్వాలేదు గాని తాను మాత్రం స్కిన్ షో చేసే అవకాశం లేదని ఆమె ఇప్పటికే చాలా సార్లు మీడియా ముందు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఒత్తిడి చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: