మన తెలుగులో చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా రెండు మూడు సినిమాలతోనే భారీగా అభిమానులను సంపాదించుకున్న  హీరోయిన్ కీర్తి సురేష్. ముఖ్యంగా ఆమె సినిమాలు కొన్ని ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. అందులో మహానటి సినిమా ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఆమె ను చూసిన అభిమానులు అయితే నిజంగా మహానటి కీర్తి అంటూ వ్యాఖ్యలు చేసారు. ప్రతీ సన్నివేశంలో కూడా ఆమె చాలా అందంగా నటించి మెప్పించింది అని చెప్పవచ్చు. 

 

అందుకే సినిమా వస్తే ఇప్పటికి అయినా సరే ప్రేక్షకులు టీవీ ముందు కూర్చునే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ఇక ఆమె స్కిన్ షో విషయానికి వస్తే తనకు అవకాశం వచ్చినా రాకపోయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా హద్దులు దాటి తన శరీరాన్ని చూపించిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ప్రతీ సన్నివేశంలో కూడా ఆమె చాలా అందంగా నటిస్తుంది అనే పేరు ఉంది గాని స్కిన్ షో చేస్తుంది అనే పేరు మాత్రం ఆమెకు ఇప్పటి వరకు లేదు. తనకు సినిమాలు అంటే ఇష్టం గాని డబ్బు అంటే ఇష్టం కాదు అని ఆమె స్పష్టం చేసింది. 

 

అదే విధంగా తాను ఏ ఒక్క సినిమాలో కూడా స్కిన్ షో చేసే అవకాశం లేదని ఆ విధంగా తన వద్దకు సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నాలను దర్శక నిర్మాతలు చేయవద్దు అని ఆమె కోరినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఏ అవకాశం వచ్చినా సరే తన పరిధిలో తాను నటిస్తా అని ఐటెం సాంగ్ లు అసలు చేసే అవకాశం లేదని డాన్స్ అయినా సరే తన పరిధిలోనే చేస్తా అని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: