తెలుగులో అయినా ఇతర భాషల్లో అయినా సరే చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా సరే కొందరు హీరోయిన్ లు మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే హీరోయిన్ లు కొందరు ఉన్నారు. టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలు చేసినా సరే తన కంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆమె నటన ఆమె సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తు లేకపోయినా ఆమెను ఎక్కువగానే ఆదరించారు. ఇక ఆమెను గౌరవించిన దర్శక నిర్మాతలు కూడా చాలా మందే ఉన్నారు. 

 

ఆమె నటనలో ప్రత్యేకంగా చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. ఎక్కడా కూడా ఆమె అసభ్యంగా దుస్తులు వేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. అవకాశం వచ్చిన అరాక్పోయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా స్కిన్ షో అనేది చేయలేదు అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె సినిమాల్లో నటించారు. ఆమెకు మన తెలుగులో స్టార్ హీరోల పక్కన సినిమాలు చేసే అవకాశం వచ్చింది. వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు వంటి వారి పక్కన అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం తన పరిధి దాటి నటించిన సందర్భం అనేది ఎక్కడా లేదు అనే చెప్పాలి. 

 

ఆమెకు క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరం అయింది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె మాత్రం స్కిన్ షో ఇష్టం లేక తర్వాత అవకాశాలు వచ్చిన అసారే చేయలేదు అని అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అది కూడా చిన్న హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తుంది. అందుకు ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి అని వార్తలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: