maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంత అక్కినేని 10 సంవత్సరాల కాలంలో ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా పెద్ద నటిగా ఎదిగింది. ఆమె నటించిన సూపర్ డీలక్స్ సినిమా చూస్తే... ఆమె నటనకు మీరు తప్పకుండా ఫిదా అవుతారు. ఒంటి చేత్తో ఆ సినిమాను సూపర్ హిట్ చేసిన ఘనత సమంత అక్కినేని కే దక్కుతుంది. 

 


తన కెరీర్ తొలినాళ్లలో చాలా అందంగా కనిపించిన సమంత అక్కినేని ఆ తర్వాత కొన్ని మేకప్స్ కారణంగా చర్మ సంబంధిత వ్యాధులకు గురై కాస్త అందవిహీనంగా మారింది. పదేళ్ల క్రితం తన అందానికి ఇప్పుడు తన అందానికి చాలా తేడా ఉంది. తన అందంలో తేడా వచ్చినా కూడా తన నటనలో ఎటువంటి తేడా రాలేదు. నిజానికి తాను నటనా రంగంలో చాలా నైపుణ్యం పొందింది.

 


సమంత అక్కినేని పలు సినిమాల్లో స్కిన్ షో బాగానే చేసింది. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఆమె చాలా సాంప్రదాయకమైన పాత్రల్లో నటించడం మనం చూడవచ్చు. మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో ఆమె నటిస్తుండగా... స్కిన్ షో చేయాల్సిన అవసరమే రావట్లేదు. ఆమె ఈ మధ్య కాలంలో నటించిన ఓహ్ బేబీ, 24, యుటర్న్, మహానటి, జాను సినిమాలలో ఎక్కడా స్కిన్ షో చేయలేదు. నాగ చైతన్య తో పెళ్లి అయిన తర్వాత స్కిన్ షో చేయడానికి, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించడానికి సమంత అక్కినేని ససేమిరా అంటుంది అని తెలుస్తుంది. ఏది ఏమైనా సమంత అక్కినేని స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను తన నటనతోనే ప్రేక్షకులందరినీ ఫిదా చేసేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సామ్ ఒక సినిమాలో, ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: