కళ్యాణి... మన తెలుగులో ఫ్యామిలి ఆడియన్స్ మర్చిపోలేని పేరు ఇది. జగపతి బాబు తో ఆమె చేసిన సినిమాలు మరికొందరు స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా వరకు మంచి పేరు తీసుకొచ్చాయి అని చెప్పవచ్చు. ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడేవి. ఏ పాత్రలో అయినా సరే ఆమె చాలా అందంగా హుందాగా నటించే వారు అనే పేరు ఉంది. హీరో పక్కన ఆమె నిండు గా ఉండే వారు రాఘవేంద్ర రావు లాంటి దర్శకుడు కామెంట్ కూడా చేసారు. వెంకటేష్ తో జగపతి బాబు తో ఆమె కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. 

 

జగపతి బాబు పక్కన ఆమె రెండు మూడు సినిమాల్లో నటించారు. అయితే ఆమె ఎక్కడ కుడా అసభ్యంగా నటించారు అనే పేరు లేదు. చాలా వరకు ఆమె లంగా ఓణీ లేదా చీర లో మాత్రమే కనపడే వారు. స్టార్ హీరో సినిమా అయినా సరే ఆమె అలాగే నటించారు. డాన్స్ ల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ఆమె డాన్స్ చేసారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆమె నటించారు. అయితే స్కిన్ షో చేయకపోవడం తోనే ఆమెకు ఆఫర్లు రాలేదు అని అంటూ ఉంటారు. ఆమె సినిమాలు మంచి హిట్స్ అయినా కూడా ఆమె కొన్ని కొన్ని విషయాల్లో కాస్త పట్టింపు గా వ్యవహరించడం తో ఆమెను దాదాపుగా పక్కన పెట్టారు. 

 

లెజెండ్ సినిమాలో ఆమె జగపతి బాబు భార్యగా నటించారు. ఆ సినిమాలో ఆమె నటన ఎక్కువగా లేదు గాని జగపతి బాబు పక్కన కావడం తో ఆమెను ప్రేక్షకులు ఆదరించారు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు చాలా వరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆఫర్లు వచ్చినా సరే ఆమె చేయడానికి ముందుకు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: