శ్రీదేవి... ఈ పేరు చాలా మందికి ఒక ఊపు. ఈ పేరు వింటే చాలు చాలా మందికి ఎక్కడ లేని ఆనందం కూడా. ఆమె సినిమాలు ఆమె నటన ఆమెకు వచ్చిన పేరు ఆమె తెచ్చుకున్న పేరు ఆమె సాధించిన విజయాలు ఇండియన్ సినిమాలోనే ఏ ఒక్క హీరోయిన్ కూడా సాధించలేదు. బాలీవుడ్ లో చేసినా టాలీవుడ్ లో చేసిన ఎక్కడ చేసినా సరే ఆమె మాత్రం తన ఇమేజ్ ని ఎక్కడ కూడా తగ్గించుకోలేదు. ఎవరికి రాని పేరు ఆమెకు వచ్చింది. ఎవరూ చూడనిపేరు ఆమె చూసింది అనే మాట అక్షరాలా నిజం. ఆమె సినిమా వస్తుంది అంటే చాలు ఆమె అభిమానులకు పండగ. 

 

ఆమె సినిమా చేస్తుంది అంటే చాలు నిర్మాతలకు కాసుల వర్షం. ఆమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఎక్కడా కూడా ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకునే విధంగా ప్రవర్తించలేదు అనే చెప్పవచ్చు. ఆమె నటనకు ఏ స్థాయిలో మార్కులు పడ్డాయో ఆమె ప్రవర్తన కు అదే స్థాయిలో మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసినా సరే స్కిన్ షో విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిధి దాటి స్కిన్ షో చేసిన సందర్భం అనేది ఎక్కడా లేదు అనే చెప్పాలి. 

 

ఆమె సినిమాల్లో ప్రధానంగా ఆమె అందం లేదా మహా  అంటే ఆమె నడుం ని చూపించడానికే చాలా మంది దర్శకులు ఆసక్తి చూపి౦చారు గాని ఆమెను అసభ్యంగా చూపించడానికి ఎవరూ కూడా ఇష్టపడలేదు అనేది వాస్తవం. ఆమె కూడా ఎక్కడ తన పరిధి దాటి నటించలేదు. ఏ హీరో తో సినిమా చేసినా సరే ఆమె అదే విధంగా నటించారు అలాగే ఉన్నారు. అందుకే శ్రీదేవి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: