దాసరి తరానికి, పూరి తరానికి మధ్య వారధిగా అంతటి టాలెంట్ కలిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తొంభై దశకంలో తన హవా నడిపించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. తమ సినిమాలకు వారిద్దరూ మాటలు కూడా రాసుకుంటే.. కృష్ణారెడ్డి సంగీతం అందించుకునేవారు. 42కు పైగా సినిమాలకు తనలోని బహుముఖ ప్రజ్ఞతో కళామతల్లి సేవ చేశారు. నేడు ఆయన జన్మదినం. ఆయన కథలన్నీ మధ్యతరగతికి చెందినవే.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేవే. అవే కృష్ణారెడ్డిని ప్రామిసింగ్ డైరక్టర్ ని చేశాయి.

IHG

1991లో కొబ్బరిబొండాం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించినా తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. అక్కడినుంచి ఆణిముత్యాల్లాంటి సినిమాలెన్నో ఇచ్చారు. శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. యమలీలలో ఆలీని హీరో ఏంటన్న వారికి బ్లాక్ బస్టర్ హిట్ తో తిరుగులేని సమాధానం చెప్పారు. ఆ సినిమాతో ఫ్యామిలీ కంటెంట్ ను చెప్పడంలో కృష్ణారెడ్డికి తిరుగులేకుండా పోయింది. నంబర్ వన్, మాయలోడు, ఘటోత్కచుడు, వినోదం, ఆహ్వానం, మావిచిగురు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళయరా, పెళ్లాం ఊరెళితే, హంగామా.. వంటి హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఎన్నో ఆయన నుంచి వచ్చాయి. నిర్మాత అచ్చిరెడ్డితో ఆయన స్నేహం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

IHG

ఫ్యామిలీ కంటెంట్ కు మంచి కామెడీ ట్రాక్ పెట్టి కథతో సమానంగా నడిపించడం కృష్ణారెడ్డి స్పెషల్. సెంటిమెంట్ చూస్తున్న ప్రేక్షకులకు మంచి కామెడీతో రిలీఫ్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఆయనలో ఉన్న మరో స్పెషల్ సంగీతం. రెగ్యులర్ మ్యూజిక్ డైరక్టర్ కు ఉండే సెన్స్ కృష్ణారెడ్డికి ఉండటం విశేషం. కృష్ణారెడ్డి సినిమా ఫ్లాప్ అయినా పాటలు ఫెయిల్ కాలేదు. ఉగాది, అభిషేకం సినిమాల్లో హీరోగా కూడా నటించి తనలోని మల్టీ టాలెంట్ ను బయటపెట్టారు. తెలుగు సినిమాకు లభించిన ‘వజ్రం’ ఎస్వీ కృష్ణారెడ్డి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: