తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది  హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ హవా నడిపించి ఆ తర్వాత పూర్తిగా కనుమరుగై పోతుంటారు. ఇక తెర మీద ఎక్కడా కనిపించరు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించి ఆ తర్వాత తెర మీద ఎక్కడా కనిపించకుండా మాయమైన హీరోయిన్లలో ఒకరు అంజలి. తెలుగు హీరోయిన్ అయిన అంజలి మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది . ఇక ప్రతి సినిమాలో దర్శకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మంచి విజయాలను కూడా అందుకుంది. 

 


 కొన్ని రోజులపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది. అయితే అంజలి ఎంతో క్రేజ్ సంపాదించినప్పటికి ఎక్కడ అందాల ఆరబోత మాత్రం చేయలేరు. మొదటినుంచి వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపింది అంజలి. నటన పరంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక సాంప్రదాయమైన వస్త్రధారణలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక అంజలి కి వచ్చిన అవకాశాలు పాత్రలు  కూడా అలాంటివే  అని చెప్పాలి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతగానో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయింది. 

 

 ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన కొద్ది కాలం పాటు తన హవాని అనిపించింది అంజలి. స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ రేంజికి చేరిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ అవకాశాలు మాత్రం చేజిక్కించుకోలేకపోయింది  అంజలి. మంచి విజయాలన్ని తన ఖాతాలో వేసుకున్నప్పటికీ... అవకాశాలను మాత్రం చేజిక్కించుకోలేదు . దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్గా నటించిన అంజలి ఆ తర్వాత మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది. ప్రస్తుతం తెలుగు తెరపై ఎక్కడా కనిపించడం లేదు అంజలి. కానీ తన హవా నడిపించిన కొంత కాలంలో మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది  అంజలి

మరింత సమాచారం తెలుసుకోండి: