ఓ భాషలో వచ్చిన సినిమాను మరో భాషలోకి రీమేక్ చేయడం సాధారణ విషయమే. కంటెంట్ ఉంటే చాలా భాషల్లో అనువాదమవుతూ ఉంటాయి.  తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండ సినిమా గద్దలకొండ గణేశ్ గా తెలుగులో చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కించాడు. అధర్వ మురళి మెయిన్ పాత్రలో నటించాడు. తమిళ్ సూపర్ హిట్ అయితే తెలుగులో హిట్ అయింది. వరుణ్ తేజ్ మాస్ అప్పీల్ కు, యాక్టింగ్ కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడీ సినిమా హిందీలో కూడా తెరకెక్కబోతోందని సమాచారం.

IHG

తమిళ్ లో బాబీ సింహ పోషించిన పాత్రను ఇక్కడ వరుణ్ తేజ్ పోషించాడు. ఇప్పుడు ఇదే పాత్రను హిందీలో అజయ్ దేవగణ్ పోషిస్తాడని బాలీవుడ్ సమాచారం. ఫుల్ ఎమోషన్స్ ఉన్న పాత్రను అజయ్ దేవగన్ ఇప్పటికే ఓకే చేశాడని అంటున్నారు. అధర్వ మురళి పాత్రను ఫరా అక్తర్ పోషించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హీరోయిన్ గా మృణాళిని చేసిన పాత్రను మిల్కీ బ్యూటీ తమన్న పోషించే అవకాశం ఉందట. హిందీ ప్రేక్షకులకు తమన్నా సుపరిచితురాలే. అజయ్ దేవ్ గన్ తో కలిసి హిమ్మత్ వాలా సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నట్ తెలుస్తోంది.

IHG

హిందీలో ఈ సినిమాకు అభిషేక్ చుబే దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఇష్కియా, ఉడ్తా పంజాబ్ సినిమాలకు అభిషేక్ దర్శకత్వం వహించాడు. రీమేక్ ను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయడంలో హరీశ్ శంకర్ మాస్టర్. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేశ్ తో ఇది ప్రూవ్ చేసుకున్నాడు కూడా. మరి అభిషేక్ ఎలా ఈ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాను సాజిద్ నడియాద్ వాలా నిర్మాణంలో తెరకెక్కనుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: