సినిమా పరిశ్రమలో ఆడవారిని వ్యభిచారులుగా చూస్తున్నారని అనేకమంది ప్రముఖ నటీమణులు అనేక సందర్భాలలో వెల్లడించి మనకి తెలియని చీకటి కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల కాలంలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని మనం వింటున్నాం. సినిమాల్లో అవకాశాలు లభించాలంటే రూము కి రావాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కామాంధులు నటీమణుల శీలములను దోచేస్తున్నారు. స్టార్ హీరోల కూతుళ్లను కూడా తమ లైంగిక వాంఛలను తీర్చాలని అడిగే వారు ఉన్నారంటే ఇక సాధారణ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని నటీమణుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తమ కామవాంఛను తీర్చుతేనే అవకాశాలు ఇస్తాం లేకపోతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పే ఎంతో మంది చేతుల్లో ఎంతోమంది నటీమణులు బలయ్యారని శ్రీ రెడ్డి సంఘటన చెప్పకనే చెబుతుంది. 


తాజాగా తమిళ నటి కళ్యాణి(పూర్ణత) క్యాస్టింగ్ కౌచ్ విషయంపై పెదవి విప్పింది. లైంగిక దోపిడీ అనేది కేవలం సినిమాల్లో మాత్రమే కాదని బుల్లితెర ఈ రంగంలో కూడా యదేచ్ఛగా కొనసాగుతుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తన యాక్టింగ్ కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలను చవి చూశానని ఆమె తెలిపింది. మొదటిలో తమిళ సినిమాల్లో నటించిన కళ్యాణి, ఆ తర్వాత తమిళ సీరియల్ లో కొన్ని ఏళ్లపాటు కనిపించింది. అయితే కాలక్రమేణా ఆమె రెండు ఇంతవరకు వెండితెరకు పూర్తిగా దూరమయింది. అయితే మీడియా వాళ్లు ఒక సందర్భంలో ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ... హీరోయిన్ యాక్టింగ్ రంగం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. అప్పుడు తాను మాట్లాడుతూ... ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో నాకు నిర్మాణ సంస్థల నుండి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చేవి. అవకాశం ఇస్తానని కాకపోతే అడ్జస్ట్మెంట్ కావాలనే వాళ్లు చెప్పేవారు. అడ్జస్ట్మెంట్ అంటే కాల్ షీట్ విషయంలో అడ్జస్ట్మెంట్ గురించి చెప్తున్నారేమోనని నేను అనుకున్నాను. మా అమ్మ గారు కూడా అవకాశాలు ఇస్తామంటే వెళ్ళమని చెప్పేవారు.

 

కానీ అడ్జస్ట్మెంట్ అంటే అర్థం తెలిసిన తర్వాత మా అమ్మ నేను ఫోన్ కాల్స్ కట్ చేసేవాళ్ళం. తనకు అలాంటి ఫోన్ కాల్స్ ఎన్నో వచ్చేవని కానీ అటువంటి అవకాశాలు వద్దనుకుని వదిలేసుకున్నాను అని తెలిపింది. బుల్లితెర లో కూడా ఇటువంటి ధోరణి కనిపించడంతో ఆమె శాశ్వతంగా ప్రేక్షకులకు దూరం అయిపోయింది. మాటీవీ కార్యక్రమానికి పెద్ద మనిషి గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి తనని పబ్ కి రావాలని పిలిచాడని... కానీ తాను ఇష్టంలేక వెళ్లలేదని ఆ తర్వాత ఆ కార్యక్రమంలో తనకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: