ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అందాల ఆరబోత చేయడం తప్పనిసరి అని అనుకునేవారు. కానీ ప్రస్తుతం హీరోయిన్లు మాత్రం అది తప్పు అని నిరూపిస్తున్నారు. అందాల ఆరబోత చేయకుండా స్టార్ హీరోయిన్ రేంజికి ఎదుగుతున్నారు. టాలెంట్ ఉంటే చాలు అందాల ఆరబోత అస్సలు అవసరం లేదు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతూ తమ హవా నడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా ఎలాంటి అందాల ఆరబోతకు తావివ్వకుండా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సాయి పల్లవి. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమ లో  ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ ఎంత అందాల ఆరబోత చేసినప్పటికీ... దర్శక నిర్మాతలను ఎంతగా ఆకర్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ... సాయి పల్లవి కి  ఉండే క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గదు. సాయి పల్లవి కోసం కొన్ని ప్రత్యేక పాత్రలు వేచి చూస్తూనే ఉంటాయి. ఆ  పాత్రలో సాయి పల్లవి తప్ప ఎవరు సెట్ అవ్వరేమో అనిపిస్తూ ఉంటుంది. అలా సాయి పల్లవి అవకాశం దక్కించుకున్న ప్రతీ పాత్రలో జీవించి మరి నటిస్తూ ఉంటుంది. డాన్సర్గా తెలుగు బుల్లితెరపై అలరించిన సాయిపల్లవి ఆ తర్వాత... డాక్టర్ చదువులు చదివినప్పటికీ సినిమా రంగంపై ఆసక్తి తో ఇటు వైపు అడుగులు వేసింది. 

 


 ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా తో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలతో ఉన్న ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అనుకున్నారు మొదలు. కానీ ఫిదా సినిమా చూసిన తర్వాత... సాయి పల్లవి అభినయానికి... సాయి పల్లవి డాన్స్ లకు... నటనకు ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సింది అందం కాదు టాలెంట్ అని నిరూపించింది సాయి పల్లవి. అయితే కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోతుంది. తనకు అవకాశాలు రాకున్న  పర్లేదు కానీ ఇక్కడ అందాల ఆరబోత మాత్రం చేయను అని స్పష్టంగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: