ఇంకా షూటింగ్ కూడా మొదలు కాలేదు అప్పుడే రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు 27 వ సినిమాగా రానున్న ఈచిత్రం యొక్క టైటిల్తో కూడిన ప్రీ లుక్  పోస్టర్ నిన్న విడుదలైంది. 24గంటల్లో ట్విట్టర్ లో మోస్ట్ రీట్వీటేడ్  ప్రీ లుక్  ,మోస్ట్ లైకడ్ ప్రీ లుక్ ,మోస్ట్ ట్వీటేడ్ టైటిల్ ట్యాగ్ గా  ఈ పోస్టర్ ఆల్ టైం రికార్డు  సృష్టించింది. ఇక టైటిల్ తోపాటు మహేష్ ప్రీ లుక్ కు నెటిజన్ల నుండి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్  వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ , లాంగ్ హెయిర్ తో చెవికి పోగు అలాగే మెడ పై  టాటూ తో మాస్ లుక్ లో కనిపించనున్నాడు. కేవలం ఒక్క టైటిల్ పోస్టర్ తోనే సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  
 
 గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ప్రస్తుతం ఈసినిమా కోసం హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు మేకర్స్ అందులో భాగంగా మహేష్ కు జోడీగా ఓ కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: