టాలీవుడ్ సినిమా పరిశ్రమకు భీభత్సం సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా కు అదిరిపోయే సాంగ్స్ అందించి తొలిసారిగా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత నుండి వరుసగా మంచి అవకాశాలు అందుకున్న థమన్, వాటిని సక్సెస్ లు గా మలుచుకుని, తన సాంగ్స్ తో శ్రోతల నుండి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సమయంలో దాదాపుగా చాలామంది పెద్ద హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ అందించిన థమన్ పై అప్పట్లో కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనే కొద్దిపాటి ముద్ర పడడంతో, అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న థమన్, ఆపై తనని తాను కొంత మార్చుకుని మళ్ళి రంగంలోకి దిగడం జరిగింది.
అనంతరం అక్కడి నుండి వరుసగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ అందిస్తున్న థమన్, ఇటీవల అలవైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన సాంగ్స్ తో జాతీయ స్థాయిలో విపరీతమైన గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, బిజినెస్ మ్యాన్ సినిమాలకు మంచి సాంగ్స్ ఇచ్చిన థమన్, దాదాపుగా ఎన్నో ఏళ్ల తరువాత అతి త్వరలో ఆయన హీరోగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు థమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ విషయమై నిన్న థమన్ ఒక ట్వీట్ చేస్తూ, మళ్ళి చాలా గ్యాప్ తరువాత తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ గారి సినిమాకు పని చేసే అవకాశం వచ్చిందని, తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకునే సాంగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని థమన్ తెలిపారు. అతి త్వరలో లాక్ డౌన్ అనంతరం సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తారో చూడాలి.....!!
My love to @14ReelsPlus #gopiachanta gaaru @RaamAchanta & @kotiparuchuri gaaru for the unconditional love & support they gave me at the time of #dhookudu was very very BIG. It’s time to show the same love & energy to them ♥️ for #SarkaruVaariPaata#gratitude
— thaman s (@MusicThaman) June 1, 2020
Heart is so happy ✊