హిట్ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడా అని అభిమానులే కాదు.. అందరూ ఎదురు చూస్తారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ అయితే ఎన్నో లాభాలున్నా.. దానితో పాటు రిస్క్ కూడా ఉంటుంది. గత హిట్ కంటే బాగుంటేనే ఆడుతుంది. ఏమాత్రం తగ్గినా.. రిజక్ట్ చేస్తారు. హిట్ కాంబినేషన్ అంచనాలతో పాటు.. బిజినెస్ ను కూడా పెంచేస్తుంది. 

 

మన స్టార్ చాలా మంది హిట్ కాంబినేషన్ వైపే మొగ్గుచూపుతున్నారు. సక్సెస్ ఇచ్చిన దర్శకులకే మళ్లీ ఛాన్స్ ఇస్తే.. హిట్ ఇస్తారన్న నమ్మకం కాబోలు. ఇదే కోవలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయిక రిపీట్ అవుతోంది. రెగ్యులర్ గా ఫ్యామిలీ మూవీస్ తీసే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ ఎంచుకొని అరవింద సమేత వీర రాఘవ తీశాడు. యుద్ధం చేసినవాడికంటే.. ఆపేవాడే గొప్పవాడన్న మెసేజ్ తో తీసి ఆకట్టుకుంటున్నాడు. 

 

అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రానుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న తారక్.. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతాడు. లాస్ట్ మూవీతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న త్రివిక్రమ్ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తీస్తాడట.  త్రివిక్రమ్ తనదైన స్టైల్లో ఈ మూవీకి అయిననూ పోయి రావలె హస్తినకు అనే పొయిటిక్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 

 

బాలకృష్ణ ఫ్లాపుల్లో ఉన్న ప్రతీసారి.. బోయపాటి హిట్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందో అని.. నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేశారు. బోయపాటి సినిమాలో ప్రతీసారి కొత్తగా కనిపించే బాలకృష్ణ.. హ్యాట్రిక్ మూవీ కోసం లుక్ పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే వెయిట్ తగ్గాడు. అఘోరా పాత్ర కోసం గుండుతో కనిపిస్తున్నాడని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: